Anchor Lasya : లాస్య కోసం వైఫ్‌కు డైవోర్స్ ఇస్తానన్న ఆ సెలబ్రిటీ.. చివరకు ఏం జ‌రిగిందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Lasya : లాస్య కోసం వైఫ్‌కు డైవోర్స్ ఇస్తానన్న ఆ సెలబ్రిటీ.. చివరకు ఏం జ‌రిగిందంటే..?

Anchor Lasya: యాంకర్ లాస్య అందరికీ గుర్తుండే ఉంటుంది. మా మ్యూజిక్ చానల్‌లో యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచతమైన లాస్య.. ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి పేరు సంపాదించుకుంది. పలు కార్యక్రమాల్లో లాస్య చేసే అల్లరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రవి, లాస్య కలిసి పలు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కోసం ఈటీవీ చానల్‌ వారు ప్రత్యేకంగా నిర్వహించిన ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో కొన్ని ఎపిసోడ్స్‌కు లాస్య యాంకరింగ్ చేశారు. సినీ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :10 November 2021,8:15 am

Anchor Lasya: యాంకర్ లాస్య అందరికీ గుర్తుండే ఉంటుంది. మా మ్యూజిక్ చానల్‌లో యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచతమైన లాస్య.. ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి పేరు సంపాదించుకుంది. పలు కార్యక్రమాల్లో లాస్య చేసే అల్లరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రవి, లాస్య కలిసి పలు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కోసం ఈటీవీ చానల్‌ వారు ప్రత్యేకంగా నిర్వహించిన ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో కొన్ని ఎపిసోడ్స్‌కు లాస్య యాంకరింగ్ చేశారు. సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని ఘటనల వల్ల కొంత కాలం పాటు లాస్య పరిశ్రమకు దూరంగా ఉంది.

Anchor lasya LOve Story

Anchor lasya LOve Story

అయితే, ఆ తర్వాత అనగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత లాస్య మళ్లీ సినీ రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన లాస్య.. ఆ తర్వాత బాగా పాపులారిటి సంపాదించుకుంది. గంగవ్వతో కలిసి సరదాగా హౌస్‌లో ఎంజాయ్ చేసింది లాస్య. ఇక ఆ తర్వాత తనకంటూ సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టుకుని పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ కూడా చేసింది లాస్య. తన చానల్ ప్రమోషన్స్ కోసం లాస్య బాగానే కష్టపడింది. లాస్య టాక్ షో పేరిట ఉన్న సదరు యూట్యూబ్ చానల్స్ ద్వారా వింత విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తోంది లాస్య. ఈ చానల్ ప్రారంభంలో గంగవ్వను కూడా ఇంటర్వ్యూ చేసింది లాస్య. ఈ సంగతులు పక్కనబెడితే…యాంకర్ లాస్య విషయంలో అప్పట్లో చాలా రూమార్స్ వచ్చాయి.

Anchor Lasya : ఆ సెలబ్రిటికి నో చెప్పిన లాస్య..

Anchor lasya LOve Story

Anchor lasya LOve Story

వాటి ప్రకారం.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ సెలబ్రిటీ లాస్యతో జీవితం పంచుకోవాలనుకున్నాడట.లాస్య కోసం ఏకంగా తన వైఫ్‌కు డైవోర్స్ ఇవ్వాలనుకున్నాడని వార్తలొచ్చాయి. సదరు సెలబ్రిటీకి వన్ ఇయర్ బేబీ, వైఫ్ ఉండగా లాస్య ఉంటే ఇష్టపడ్డాడట. అయితే, లాస్య ఆ సెలబ్రిటీతో మ్యారేజ్‌కు నో చెప్పిందట. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కొద్ది కాలం తర్వాత యాంకర్ లాస్య మంజునాథ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది