Anasuya : అనసూయ స్థానంలో ఆ యాంకర్‌కి ఛాన్స్.. రెమ్యునరేషన్ తక్కువేనట..!
Anasuya : జబర్ధస్త్ లాంటి షోతో ఫుల్ ఫేమస్ అయిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. బుల్లితెరపై ఎంతో మంది కమెడీయన్స్ ఉన్నా కూడా అనసూయ క్రేజ్ వేరే లెవల్ అని చెప్పాలి. మొదట న్యూస్ ఛానల్ లో పనిచేసిన అనసూయ జబర్దస్త్ ద్వారా తన గ్లామర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. రీసెంట్‌గా ట్విట్టర్ ద్వారా అనసూయ చేసిన ఒక పోస్ట్ అనసూయ జబర్ధస్త్‌కి స్వస్తి పలకనుందనే ఆలోచనలు కలిగిస్తుంది. ఎన్నో ఏళ్లుగా తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ ఎప్పుడు జబర్దస్త్ లో కనిపించకపోతే జబర్దస్త్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.
ఇప్పటికే జడ్జిలు, ప్రముఖ కమెడియన్లు జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి . అనసూయ కూడా వెళ్లిపోతే పరిస్థితి ఏంటని ముచ్చటించుకుంటున్నారు. యాంకర్ అనసూయ వెళ్లిపోతే ఆమె స్థానాన్ని భర్తీ చేయడం అంటే చాలా కష్టమే. రెండు జబర్దస్త్ షోలు కొనసాగుతున్నాయి కాబట్టి ఒకవైపు రష్మి బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు అనసూయ వెళ్ళిపోతే జబర్దస్త్ షో కోసం మళ్లీ కొత్త యాంకర్ గా ఎవరు వస్తారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ కారమైతే మంజుష రాంపల్లి మొదటి ఆప్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఇటీవల గ్లామర్ తో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ అందుకుంటుంది.

Anchor Manjusha replacement for anasuya
Anasuya : అనసూయ రీప్లేస్‌మెంట్..
అయితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అనసూయ కన్నా తక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఎపిసోడ్ కి అనసూయ లక్ష రూపాయలు తీసుకోగా.. మాంజుష కి 50 వేల వరకు ఇవ్వనున్నట్టు సమాచారం.కాగా, యాంకర్ అనసూయ జబర్దస్త్ ద్వారానే చాలా మంచి గుర్తింపు అందుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత సినిమాలలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఆమె జబర్దస్త్ వదలలేదు. నాగబాబు రోజాతో పాటు ఆమె కూడా యధావిధిగా కొనసాగుతూ వచ్చారు. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా ఆమె మంచి ఆదాయం కూడా అందుకున్నారు. వారంలో ప్రసారమయ్యే ఒక ఎపిసోడ్ కోసం ఆమె దాదాపు లక్షకుపైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.