Rashmi Gautam : నన్ను ట్యాగ్ చేయడం వల్లే ఉపయోగం లేదు.. యాంకర్ రష్మీ ఆవేదన

Authored By aruna | The Telugu News | Published on: August 6, 2022, 8:20 pm

Rashmi Gautam : యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం బుల్లితెరపై ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అనసూయ కూడా ఈటీవీ నుంచి వెళ్లిపోవడంతో రష్మీకి మరింత చాన్సులు వస్తున్నాయి. ఇటు సుధీర్ వెళ్లిపోవడం, అటు అనసూయ వెళ్లిపోవడంతో రష్మీకి బాగానే కలిసి వచ్చింది. సుధీర్ బయటకు వెళ్లడంతో శ్రీదేవీ డ్రామా కంపెనీకి రష్మీ యాంకర్‌గా మారింది. ఇటు అనసూయ వెళ్లిపోవడంతో జబర్దస్త్ షోకు యాంకర్‌గా మారింది రష్మీ. అలా మొత్తానికి ఈ మూడు షోల్లోనూ ఇప్పుడు రష్మీనే కనిపించబోతోంది. ఇలా రష్మీ గౌతమ్ బుల్లితెరపై ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్‌కు అందుబాటులోనే ఉంటుంది. ఫ్యాన్స్ చేసే కామెంట్స్, తన పేరిట చేసే సేవా కార్యక్రమాల మీద స్పందిస్తుంది.

మరీ ముఖ్యంగా రష్మీ మూగ జీవాల పట్ల మక్కువ చూపిస్తుంటుంది. రష్మీ జంతు ప్రేమికురాలన్న సంగతి అందరికీ తెలిసిందే. రష్మీ చేసే మంచి పనులు, మూగ జీవాల పరిరక్షణకు చేసే పనులు, పడే తాపత్రయంతో అందరి అభిమానాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు అంటూ మూగ జీవాలను బలి ఇవ్వడాన్ని రష్మీ వ్యతిరేకిస్తుంది. అది బక్రీద్ అయినా దసరా అయినా ఇలా ఏ పండుగ అయినా ఏ మతానికి సంబంధించిన ఆచారమైనా కూడా రష్మీ వ్యతిరేకిస్తుంటుంది. సంక్రాంతి కోళ్ల పందెలైనా సరే వ్యతిరేకిస్తుంది. ఇక పెట్స్ సంరక్షణ కోసం రష్మీ ముందుంటుంది.

Anchor Rashmi Gautam About Animals ni champadam

Anchor Rashmi Gautam About Animals ni champadam

వీధుల్లో గాయపడిన పెట్స్‌ను తెచ్చి కాపాడుతుంది. ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తుంటుంది. అలాంటి రష్మీ తాజాగా ఓ నెటిజన్ వేసిన పోస్ట్ మీద ఘాటుగా స్పందించింది. ఓ జంతువును బలి ఇస్తున్న ఫోటోను రష్మీకి ట్యాగ్ చేశాడు. దీనిపై రష్మీ స్పందించింది. ఇలా కేవలం నాకు ట్యాగ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మీ డీటైల్స్.. అది జరిగిన ప్లేస్, దాని డీటైల్స్ పంపిస్తేనే నేను ఏమైనా చేయగలను.. మీరు కూడా ఈ పోరాటానికి సిద్దంగా ఉండాలి అంటూ నెటిజన్‌కు సూచించింది.

Anchor Rashmi Gautam About Animals ni champadam

Anchor Rashmi Gautam About Animals ni champadam

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp