Rashmi Gautam : అవ‌కాశాల కోసం ప‌డుకుంటే తప్పేంటి.. యాంకర్ రష్మీ సెన్సేషనల్ కామెంట్స్..!

Advertisement

Rashmi Gautam : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది రష్మి గౌతమ్. ఇండస్ట్రీ లోకి హీరోయిన్ అవుదామని వచ్చిన రష్మి బుల్లితెరపై యాంకర్ గా స్థిరపడిపోయింది. ఇక అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తున్న రష్మి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

ఇక అప్పుడప్పుడు రష్మీ కొన్ని విషయాలపై ఓపెన్ గా కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇకపోతే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై చాలామంది ఓపెన్ గా చెప్పారు. చాలామంది సెలబ్రిటీలు తమ జీవితంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను వెల్లడించారు. అయితే కాస్టింగ్ కౌచ్ అనేది కొందరు తప్పు అంటుంటే మరికొందరు తప్పు కాదని చెబుతున్నారు. తాజాగా రష్మీ ఓ ప్రమోషన్ ఈవెంట్లో కాస్టింగ్ కౌచ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్ పై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా దానికి బదులుగా రష్మి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

Advertisement
Anchor rashmi gautam comments about casting cuch
Anchor rashmi gautam comments about casting cuch

రష్మీ మాట్లాడుతూ అవకాశాల కోసం వెళ్లడం తప్పు కాదు, దాని ఒక ఛాయిస్ గా మాత్రమే చూడాలి. వాళ్ల ఇష్ట పూర్వకంగా వెళ్ళినప్పుడు అది తప్పు కాదు, ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది. ఏదైనా సరే మనం తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ కౌచ్ కి అంగీకరించడంలో తప్పేమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇలా వెళ్లిన వాళ్లు తర్వాత మళ్లీ కాస్టింగ్ కౌచ్ అంటూ గొడవ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ల ఇష్ట పూర్వకంగానే వెళ్లాక దానిని తప్పు అని ఎలా అంటారు అని రష్మి చ చెప్పుకొచ్చింది.

Advertisement
Advertisement