Rashmi Gautam : దిగి పోద్ది అంటూ కమెడియన్‌కు రష్మీ వార్నింగ్.. ఆ మాటతో హర్టైన యాంకర్
Rashmi Gautam : యాంకర్ రష్మీ ప్రస్తుతం బుల్లితెరపై అన్ని చోట్లా కనిపిస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోలను వరుసపెట్టి చేస్తోంది. అసలే రష్మీకి ఇంకో పని లేదు. ఆమె ఫోకస్ అంతా కూడా బుల్లితెరపైనే ఉంది. సినిమాలు కూడా పక్కన పెట్టేస్తోంది. అందుకే ఇలా అన్ని బుల్లితెర షోలను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆమెకు ఇక్కడే కంఫర్ట్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. యాంకర్ రష్మీ మొత్తానికి మళ్లీ తన స్థానానికి వచ్చేసింది. మొదట్లో రష్మీ జబర్దస్త్ షోకు యాంకర్‌గా ఉండేది.అనసూయ వదిలి వెళ్లిన స్థానంలోకి రష్మీ వచ్చింది. అలా కొన్నేళ్లు సింగిల్‌గా సింగిల్ హ్యాండ్‌తో షోను నడిపించింది…
ఆ తరువాత మళ్లీ అనసూయ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది. దీంతో రెండు షోలుగా విడగొట్టేశారు. ఒకరు జబర్దస్త్, ఇంకొకరు ఎక్స్ ట్రా జబర్దస్త్ చూసుకున్నారు. ఇక ఇన్నేళ్లకు మళ్లీ జబర్దస్త్ స్థానం తనకు వచ్చింది. రష్మీ ఇప్పుడు జబర్దస్త్ యాంకర్‌గానూ కొనసాగుతోంది. అయితే ఇది తాత్కాలికమేనని తెలుస్తోంది. కొత్త యాంకర్ దొరికే వరకు నన్ను కాస్త భరించండి ప్లీజ్ అంటూ రష్మీ వేడుకుంటూ ఓ పోస్ట్ వేసింది. అయితే ఆ కొత్త యాంకర్ ఇప్పట్లో దొరకరని తెలుస్తోంది.ఈ జబర్దస్త్ షోని కూడా యాంకర్ రష్మీనే ముందుండి నడిపించేలా ఉంది.
Anchor Rashmi Gautam Satires on Sudhakar in Jabardasth Promo
Rashmi Gautam : దింపుతా అంటూ వార్నింగ్ ఇచ్చిన రష్మీ..
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ అదరగొట్టేసింది. గాలి పటాల సుధాకర్ టీంలోని ఓ మెంబర్ కౌంటర్ వేసేందుకు ప్రయత్నించాడు. ఎవరు ఈమె.. విస్కీనా?, రమ్మా? చూస్తుంటే మత్తెక్కిపోతోంది అని అంటాడు. దగ్గరకు వెళ్లి చూడు దిగిపోద్ది అని అంటాడు. దీంతో రష్మీ.. నీకు దింపుతా అని వార్నింగ్ ఇస్తుంది.
