Anasuya : జబర్దస్త్ నుంచి అనసూయ అవుట్!.. అందుకే రష్మీ వచ్చిందా?
Anasuya : బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జబర్దస్త్ యాంకర్‌గా అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్‌గా రష్మీ ఫిక్స్ అయినప్పటి నుంచి షో మరింతగా మారిపోయింది. అలా మొత్తానికి రష్మీ,అనసూయ మధ్య వైరం రాకుండా ఇలా డివైడ్ చేసి పారేశారు. అయితే ఒకరి షోలకు మరొకరు రారు.
కానీ తాజాగా అనసూయ స్థానంలో రష్మీ వచ్చింది. అనసూయ హోస్ట్ చేయాల్సిన ప్లేస్‌లో రష్మీ దుమ్ములేపేస్తోంది. ఈ మార్పుకు మామూలు కారణాలే ఉన్నాయా? లేదా భారీగా మార్పులు చేర్పులు జరగబోతోన్నాయా? అనే అనుమానాలు ఇప్పుడు సో,, అవుతున్నాయి. మామూలుగా అయితే అనసూయ ఎప్పుడూ కూడా తన జబర్దస్త్ షూటింగ్‌ను మిస్ అవ్వదు.

Anchor Rashmi In Palce Of Anasuya InJabardasth Show
Anasuya : అనసూయ స్థానంలో రష్మీ
కానీ ఇప్పుడు వరుసగా సినిమాలతో అనసూయ బిజీగా మారింది. దీంతో జబర్దస్త్ షూటింగ్‌కు హాజరు కాలేకపోతోంది. అందుకే అనసూయ స్థానంలో ఇలా రష్మీ గెస్టుగా వచ్చి షోను ముందుకు నడిపించినట్టు తెలుస్తోంది. ఒక వేళ అనసూయ పూర్తిగా మానేసినా కూడా వచ్చే నష్టమేమీ లేదని అర్థమవుతూనే ఉంది. రష్మీ రెండు షోలను ఈజీగా లాగించేస్తుంది.
