Anchor Rashmi : నడిరోడ్డు మీద చిందులు.. మొత్తానికి చేసేశానంటోన్న యాంకర్ రష్మి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Rashmi : నడిరోడ్డు మీద చిందులు.. మొత్తానికి చేసేశానంటోన్న యాంకర్ రష్మి

 Authored By prabhas | The Telugu News | Updated on :10 June 2022,9:00 pm

Anchor Rashmi : బుల్లితెరపై యాంకర్ రష్మి క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సుధీర్ రష్మీ జోడిగా ఎంత అలరించిందో.. ఒంటరిగా సుధీర్, రష్మీలు కూడా అంతే అలరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి ఈ జోడి వేరు అయింది. సుధీర్ స్టార్ మాకు వెళ్లిపోయాడు. రష్మీ ఈటీవీలోనే ఉండిపోయింది. అయితే రష్మీ అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్ల కోసం స్టార్ మాలోకి వెళ్తుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం రష్మీ ఈటీవీకే పరిమితమైంది.ఎక్స్ ట్రా జబర్దస్త్ మాత్రమే కాకుండా.. శ్రీదేవీ డ్రామా కంపెనీని కూడా నడిపిస్తోంది రష్మీ. గత వారం నుంచే రష్మీ శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి వచ్చింది.

యాంకర్‌గా ఆ షోను నడిపించేందుకు ముందుకు వచ్చింది. మొత్తానికి రష్మీ మాత్రం సుధీర్ లేని లోటును తీర్చాలని చూస్తోంది. కానీ జనాలు మాత్రం సుధీర్‌నే కోరుకుంటున్నారు. అయినా కూడా సుధీర్ వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక రష్మీ మాత్రం కంటిన్యూ అయ్యేట్టుంది. తాజాగా రష్మీ ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. అది కూడా నడి రోడ్డు మీద చేసేసింది. అసలే రష్మీ డ్యాన్సులు ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. స్టేజ్ మీద రష్మీ స్టెప్పులు వేస్తే అవి ట్రెండింగ్‌గా మారుతున్నాయి.ఓ సారి ఇలానే రష్మీ తన నడుము ఊపుతూ వేసిన స్టెప్పులు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక బిగ్ బాస్ పరివార్ అంటూ జరగబోతోన్న ఈవెంట్‌లోనూ రష్మీ ఓ రేంజ్‌లో స్టెప్పులు వేసినట్టుంది.

Anchor Rashmi Mehabooba Song Reel Video

Anchor Rashmi Mehabooba Song Reel Video

ఇక ఇప్పుడు ఈ రీల్ వీడియోలో అయితే రష్మీ సింపుల్‌గా తన కళ్లతోనే మాయ చేసేస్తోంది. చీరకట్టుతో అందరినీ కట్టిపడేస్తోంది. అసలే తనకు ఎంతో ఇష్టమైన పాట అని, ఈ మధ్య అదే మైండ్‌లో తిరుగుతోందని కూడా రష్మీ చెప్పుకొచ్చింది. కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాలోని మెహబూబ అనే పాట ఈ మధ్య ఎక్కువగా తిరుగుతోందని, అందుకే ఈ రీల్ వీడియో చేశాను అని రష్మీ తెలిపింది. ఇక రష్మీ సోయగాలు చూసి జనాలు ఫిదా అవుతున్నారు. రష్మీ అందాలను నెటిజన్లు పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది