Sudigali Sudheer : దెయ్యాన్ని వ‌ద‌ల‌నంటున్న సుడిగాలి సుధీర్.. రాత్రికి ర‌మ్మ‌ని పిలుస్తున్నాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : దెయ్యాన్ని వ‌ద‌ల‌నంటున్న సుడిగాలి సుధీర్.. రాత్రికి ర‌మ్మ‌ని పిలుస్తున్నాడుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Sudigali Sudheer : దెయ్యాన్ని వ‌ద‌ల‌నంటున్న సుడిగాలి సుధీర్.. రాత్రికి ర‌మ్మ‌ని పిలుస్తున్నాడుగా..!

Sudigali Sudheer : జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకొని టాప్ సెల‌బ్రిటీగా మారిన వారిలో సుడిగాలి సుధీర్ ఒక‌రు. ఒక‌ప్పుడు మ‌నోడు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు. ఆఫీసులు చుట్టూ తిరుగుతూ నానా తంటాలు ప‌డ్డాడు. అయితే జ‌బర్ధ‌స్త్‌తో వ‌చ్చిన క్రేజ్‌తో సుడిగాలి సుధీర్ ఆనతి కాలంలో నే స్టార్ కమెడియన్ గా మారాడు. తనదైన కామెడీతో, వ్యక్తిత్వంతో హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఎలాంటి షో అయిన సుధీర్ ఉంటే ఆ షోకి కొత్త కళ వ‌స్తుంది. ఇక బుల్లితెర క్రేజ్‌తో సుడిగాలి సుధీర్ హీరోగా కూడా మారాడు. ప‌లు సినిమాలు చేసి మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆహాలో సర్కార్‌ 4 షో చేస్తున్నాడు. ఈటీవీలోనూ కనిపించబోతున్నారు.

Sudigali Sudheer దెయ్యాన్ని వ‌ద‌లవా..

తాజాగా ఈ ఎపిసోడ్ లో లవ్ మీ సినిమా టీమ్ సందడి చేసింది. హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య, రవి క్రిష్ణ, సిమ్రాన్ చౌదరి పాల్గొన్నారు. ఇక అమ్మాయిలతో సుధీర్ కలిపే పులిహోర కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఈ సినిమాలో దెయ్యంతో ప్రేమ అనగానే దెయ్యంతో కూడా నాకు ఓకే అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక దెయ్యం తో కూడా పులిహోర కలుపుతూ.. సర్ ఈ నైట్ కు రమ్మని చెప్పండి అంటూ నవ్వులు పూయించాడు. అనంతరం రవికృష్ణతో ఒక ఆట ఆడుకున్నాడు. ఈ రియాలిటీ షో ప్రోమో అందర్నీ ఆకట్టుకొంటున్నది. సుధీర్ అన్న తోపు దమ్ముంటే ఆపు.. అన్న ఏ షోలో ఉంటే అక్కడ ఎంటర్ టైన్మెంట్ పక్కా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Sudigali Sudheer దెయ్యాన్ని వ‌ద‌ల‌నంటున్న సుడిగాలి సుధీర్ రాత్రికి ర‌మ్మ‌ని పిలుస్తున్నాడుగా

Sudigali Sudheer : దెయ్యాన్ని వ‌ద‌ల‌నంటున్న సుడిగాలి సుధీర్.. రాత్రికి ర‌మ్మ‌ని పిలుస్తున్నాడుగా..!

సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ షోలోనూ ప్లేబాయ్‌ క్యారెక్టర్‌తో కామెడీ చేసి నవ్వులు పూయించాడు. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో అదరగొట్టేవాడు. అమ్మాయిలను పడేసే కుర్రాడిగా, ఆడవాళ్లంటే పడి చచ్చే వ్యక్తిలా ఇలా ఏదో రూపంలో ఆ ప్లేబాయ్‌ క్యారెక్టర్‌, డైలాగ్‌లు పేల్చుతూ ఆకట్టుకున్నాడు. దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్లు జబర్దస్త్ షోని రక్తికట్టించాడు. జబర్దస్త్ షోలో యాంకర్‌ రష్మితో కలిసి పులిహోర కలిపాడు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. నిజంగానే లవర్స్ లాగా యాక్ట్ చేసి మెప్పించారు. స్టేజ్‌పైనే రొమాన్స్ ని రక్తికట్టించి అలరించారు. ఇకపోతే ప్రస్తుతం సుధీర్.. గోట్ అనే సినిమాలో నటిస్తున్నాడు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది