Hyper Aadi : హైపర్ ఆదికి ఐ లవ్యూ చెప్పిన రీతూ.. లాగిపెట్టి కొట్టిన రష్మీ.. అసలే విషయం ఏంటంటే?
Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది, యాంకర్ రష్మీ, సుధీర్ ఇలా ఎప్పటికీ క్రేజ్‌తో దూసుకుపోతూనే ఉంటారు. వీరికి తిరుగుండదు. వీరంతా కలిసి ప్రోగ్రాం చేస్తే అది కచ్చితంగా హిట్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా తలో ప్రోగ్రాం చూసుకున్నారు. ఇప్పుడు రష్మీ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోకి వచ్చింది. జబర్దస్త్ షోను ఆది వదిలేశాడు. సుధీర్ అయితే ఏకంగా మల్లెమాల, ఈటీవీని వదిలేశాడు. స్టార్ మాలోకి వెళ్లిపోయాడు. అలా మొత్తానికి ఎన్నెన్నో మార్పులు చేర్పులు జరిగాయి. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీకి కొత్త యాంకరమ్మగా రష్మీ వచ్చింది. రష్మీ తన మొదటి ఎపిసోడ్లో బాగానే ఆకట్టుకుంది.
అయితే రష్మీ కూడా టీఆర్పీ స్టంట్లలో ఆరితేరిపోయింది. ఎందుకంటే ఓ ఇన్సిడెంట్‌లో కళ్లు తిరిగిపోయినట్టు నటించింది.. మరో సందర్భంలో ఆదిని లాగి పెట్టి కొట్టేసినట్టు నటించింది. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. టీఆర్పీ స్టంట్లు అంటూ స్పెషల్‌గా చేసిన ఈ స్కిట్లో ఒక్కొక్కరు విశ్వరూపం చూపించారు. రీతూ అయితే స్టేజ్ మీదే ఆదికి ప్రపోజ్ చేసింది. తను అంటే చాలా ఇష్టమని అందరి ముందే చెప్పేసింది. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు అంటూ ఆదిని స్టేజ్ మీదకు పిలిచింది. ఆది అంటే తనకు ఇష్టమని రీతూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
Anchor Rashmi Slaps Hyper Aadi In Sridevi Drama Company
ఇదేంట్రా నాకు చెప్పలేదు అని ఆదిని రాం ప్రసాద్ అంటే.. అది నాకే ఇంత వరకు చెప్పలేదు అని ఆది అంటాడు. ఇక రీతూ అందరి ముందే ప్రపోజ్ చేసింది. ఐ లవ్యూ ఆది అని మోకాళ్ల మీద నిల్చుంది. నువ్ కాదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను..అని అంటుంది. కానీ నీ మీద నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు అని ఆది రిజెక్ట్ చేస్తాడు. దీంతో రీతూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఆ వెంటనే రష్మీ వేగంగా వచ్చి ఆది చెంప చెల్లుమనిపిస్తుంది. ఓ అమ్మాయి మనసు ముక్కలు చేస్తావా? అంటూ అరిచేస్తుంది.నువ్ బాబు గారి మనసును చేయలేదా? అని కౌంటర్ వేయడంతో రష్మీ సైలెంట్‌గా వెళ్లి కూర్చుంటుంది.
