Anasuya : అనసూయ సెల్ ఫోన్ లో ‘ టాప్ సీక్రెట్ ‘ .. స్టేజీ మీదే బయటపెట్టిన యాంకర్ రవి !
Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈటీవీలో జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయింది. తనకు లైఫ్ ఇచ్చింది కూడా జబర్దస్త్ నే. అయితే వివిధ కారణాల తో జబర్దస్త్ షో వదిలి బయటకు వచ్చింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకి దిమ్మతిరిగిపోయేలా ఆన్సర్ ఇస్తుంది అనసూయ. ఇక ఈ మధ్యనే మా టీవీ లో సింగింగ్ షోలో యాంకర్ గా చేసింది. కానీ అది అయిపోయింది. ఇక ఇప్పుడు ఏ షోలు లేక బుల్లితెరకు దూరంగా ఉంటుంది. అయితే తాజాగా అనసూయ ఓ ఈవెంట్లో కనిపించింది. మాయాపేటిక అనే సినిమా ఈవెంట్ కోసం అనసూయ వచ్చింది.
అనసూయ చేసిన థాంక్యూ బ్రదర్ సినిమా నిర్మాతలు మళ్లీ మరో సినిమా తీశారు. అదే మాయాపేటిక. ఈ సినిమా ఫస్ట్ లుక్కును అనసూయ చేతుల మీద లాంచ్ చేశారు. అనసూయ ఈవెంట్లో హంగామా చేసింది. అనసూయ మాట్లాడుతూ నన్ను చాలామంది సెల్ఫిష్ అని అంటారు. సినిమాలో నేను లేకపోయినా ఆ సినిమా బాగుంది అని అంటాను అంటే అర్థం చేసుకోండి అంటూ సినిమా పొగిడింది. మాయపేటిక సినిమాకి హోస్టుగా యాంకర్ రవి చేశాడు. అందరిని సెల్ ఫోన్ ల సీక్రెట్ ల గురించి అడిగాడు. కానీ అనసూయని మాత్రం అడగలేదు. ఇదే విషయాన్ని అనసూయ రవిని స్టేజ్ మీద అడిగింది.
anchor Ravi and anasuya fun at mayapetika movie event
అందరినీ అడిగావు నన్ను ఎందుకు అడగలేదు అని రవిని నిలదీసింది అనసూయ. అడుగుదామని అనుకున్న ఎన్నెన్నో ప్రశ్నలు ఉండే కానీ మర్చిపోయాను ఎందుకొచ్చిన గొడవ అంటూ రవి సైలెంట్ అయిపోయాడు. ఇక అనసూయ నాదంతా కూడా ట్విట్టర్ లోనే ఉంటుంది అన్నట్లుగా తన కాంట్రవర్సీల మీద తానే కౌంటర్లు వేసుకుంది. మొత్తానికి ట్విట్టర్కు అనసూయ కి మంచి రిలేషన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆమె వేసే ప్రతి ట్వీట్ కాంట్రావర్సీగా మారుతుంటుంది. మొత్తానికి అయితే అనసూయ మాత్రం మాయాపేటిక సినిమా ఈవెంట్లో తెగ సందడి చేసింది.
