Samantha Yashoda movie Minus points
Samantha Yashoda : భారీ అంచనాల నడుమ రూపొంది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత యశోద సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా లోని సమంత యాక్టింగ్ అభిమానులకు ఒకింత నచ్చే విధంగా ఉంది, కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అత్యంత దారుణంగా ఉందని.. క్లైమాక్స్ బాబోయ్ కూర్చోలేక పోతున్నాం అన్నట్లుగా ఉంది అంటూ సినిమా ను చూసిన ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. థియేటర్ నుండి బయటకు వస్తున్న ప్రేక్షకులు వాడి పోయిన మొహంతో కనిపించడంతో అసలు మేటర్ ఏంటి అని ప్రశ్నించగా ఫస్టాఫ్ లోనే వచ్చేద్దాం అన్నంత చెత్తగా సినిమా ఉందంటూ కొందరు చెప్పడం ఆశ్చర్యానికి కలిగి గురి చేస్తుంది.
సెకండ్ హాఫ్ లో అయినా సినిమా బాగుంటుందేమో అని ఎదురు చూశాము, కానీ క్లైమాక్స్ బాలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. యశోద సినిమా కు అతి పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ లోని కథ ఏమీ లేక పోవడం అని.. అలాగే సెకండాఫ్ లోని క్లైమాక్స్ మినిమం ఇంట్రెస్ట్ కలిగించడంలో విఫలమైందని రివ్యూలు రాసిన వారు కూడా చెబుతున్నారు. మొత్తానికి సమంత యశోద భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ కలెక్షన్స్ నమోదు చేయడంలో వెనకపడే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సమంత యశోద సినిమాలో సరోగసి నేపథ్యంలోని కథను చూపించిన విషయం తెలిసిందే.
Samantha Yashoda movie Minus points
డబ్బు అవసరం అయ్యి సరోగసి మధర్ అవ్వడానికి సమంత ఓకే చెప్తుంది. అలా తనలాగే వందలాది మంది సరోగసి మదర్స్ గా అయ్యేందుకు ఓకే చెప్పి ఒక ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ఆ ప్రమాదం ఏంటి, సమంత వారందరిని ఎలా రక్షించింది.. ఇంతకు ఆ ప్రమాదం వెనుక ఉన్న విలన్స్ ఎవరు అనేది సినిమాలో దర్శకులు చూపించే ప్రయత్నం చేశారు. సమంత తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. కానీ దర్శకులు ఈ సినిమాకు న్యాయం చేయలేదనేది టాక్. సమంత అభిమానులు ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.