Bigg Boss 5 Telugu : షన్నులో ప్రేమలో ఉన్న సిరి!.. యాంకర్ రవి సంచలన కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 5 Telugu : షన్నులో ప్రేమలో ఉన్న సిరి!.. యాంకర్ రవి సంచలన కామెంట్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :29 November 2021,9:40 am

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ నుంచి యాంకర్ రవి బయటకు వచ్చాడు. ఈ ఎలిమినేషన్‌ను ఎవ్వరూ ఊహించలేదు. అది కచ్చితంగా అన్ ఫెయిర్.. అంటూ బిగ్ బాస్ షో మీద, నిర్వాహకుల మీద ప్రేక్షకులు గుర్రుగా ఉన్నారు. ప్రియాంక, కాజల్, సిరి కంటే రవి ఎన్నో రెట్లు మేలు.. అయినా కూడా రవికి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడమేంటి.. ఇలా ఎలిమినేట్ చేయడమేంటి? అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి రవి అయితే బయటకు వచ్చాడు. అరియానాతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేసేశాడు. ఆ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో సిరి, షన్నుల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అసలు షన్ను ఇంట్లో ఎప్పుడు ఆట ఆడాడంటూ కౌంటర్లు వేశాడు. ఇక వారి రిలేషన్ మీద అరియానా ప్రశ్నలు సంధించింది. దీంతో రవి అసలు విషయాన్ని చెప్పేశాడు. సిరి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిందంటూ ఓపెన్ అయ్యాడు రవి.

Anchor Ravi On Siri Shannu Relationship In Bigg Boss 5 Telugu

Anchor Ravi On Siri Shannu Relationship In Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu : షన్నుని ఇష్టపడుతున్న సిరి

దీప్తి సునయనను షన్ను ఎంత ప్రేమిస్తున్నాడో బయట అందరికీ తెలుసు. శ్రీహాన్‌ను సిరి ఎంత ప్రేమిస్తుందో అందరికీ తెలుసు. కానీ లోపల ఆ ఇద్దరూ మాత్రం కనెక్ట్ అయ్యారు. నేను సిరిని పర్సనల్‌గా అడిగాను.. నాకు షన్ను అంటే ఇష్టం.. ఐ లైక్ షన్ను.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యామంటూ సిరి చెప్పిందట. ఈ విషయాలన్నీ రవి బయటపెట్టేశాడు. మరి రానున్న ఈ మూడు వారాల్లో సిరి షన్ను వ్యవహారం ఎలా ఉంటుందో చూడాలి

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది