Anchor Ravi : పాపం యాంకర్ రవి కెరియర్ ఇలా అయ్యిందేంటి.. అందుకే ప్రదీప్..!
Anchor Ravi : ఒకప్పుడు తెలుగు బుల్లి తెర పై యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు స్థాయిలో రవి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇద్దరు కూడా పోటా పోటీగా కార్యక్రమాలు చేసేవారు. కెరియర్ ఆరంభంలో యాంకర్ రవి, లాస్యతో కలిసి ఎక్కువ కార్యక్రమాలు చేశాడు. ఆయనకు ఆమెతో.. ఆమెకు ఆయనతో మంచి గుర్తింపు లభించింది. ఆ సమయంలోనే ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అసలు విషయం ఏంటంటే.. అప్పటికే ఇద్దరు కూడా వేరు […]
Anchor Ravi : ఒకప్పుడు తెలుగు బుల్లి తెర పై యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు స్థాయిలో రవి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇద్దరు కూడా పోటా పోటీగా కార్యక్రమాలు చేసేవారు. కెరియర్ ఆరంభంలో యాంకర్ రవి, లాస్యతో కలిసి ఎక్కువ కార్యక్రమాలు చేశాడు. ఆయనకు ఆమెతో.. ఆమెకు ఆయనతో మంచి గుర్తింపు లభించింది. ఆ సమయంలోనే ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అసలు విషయం ఏంటంటే.. అప్పటికే ఇద్దరు కూడా వేరు వేరుగా వివాహాలు చేసుకుని ఉన్నారు. పెళ్లి విషయాలను బయటకు చెప్పకుండా మేనేజ్ చేశారు.
ప్రేమ విషయం బయటకు తెలియడంతో లాస్య అతడికి దూరమైంది. లాస్య దూరమైన తర్వాత కొన్నాళ్ల పాటు యాంకర్ రవి కెరియర్ సాఫీగానే సాగింది.. అదే సమయంలో యాంకర్ రవి తన భార్యను మరియు బిడ్డను పరిచయం చేశాడు. భార్య బిడ్డతో కూడా బుల్లి తెరపై చాలా రోజులు సందడి చేశాడు. రెగ్యులర్ గా మూస తరహా కామెడీతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఎదుటి వారిని తక్కువ చేసి యాంకర్ రవి మాట్లాడుతాడు అనే విమర్శలు ఉన్నాయి, అందుకే ఆయన కార్యక్రమాలు అంటే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
ఆ కారణంగానే చాలా మంది ప్రొగ్రాం ప్రొడ్యూసర్స్ యాంకర్ రవితో అనుకున్న కార్యక్రమాలను మరో యాంకర్ తో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ మా మరియు ఈటీవీ కార్యక్రమాలకు యాంకర్ రవి కనిపించడం లేదు. బుల్లితెర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రదీప్ తో పోలిస్తే యాంకర్ రవి అత్యంత దారుణమైన కెరియర్ ని అనుభవిస్తున్నాడు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా యాంకర్ రవితో పోలిస్తే ప్రదీప్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాడు అంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. యాంకర్ రవి మళ్లీ పుంజుకుంటాడా లేదంటే పూర్తిగా కనుమరుగవుతాడా అనేది చూడాలి.