Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ను బండ బూతులు తిట్టేసిన యాంకర్ శివ.. సిగరెట్లు పంపలేదని..
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ అంటేనే కొట్లాటలు, తిట్టుకోవడాలు, ఇష్టం వచ్చినట్టు రొమాన్స్ చేయడాలకు వేదికగా మారిందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ అంటూ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ పేరిట ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఓటీటీ బిగ్ బాస్ లో కూడా అనేక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రోజుకో రచ్చ బిగ్ బాస్ లో వెలుగు చూస్తూనే ఉంది. కాగా ప్రతి సీజన్ లో బిగ్ బాస్ ను తిట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు యాంకర్ శివ కూడా ఇదే కోవలోకి వచ్చేశాడు.ఇప్పటి వరకు బిగ్ బాస్ లో బూతులు తిట్టుకోవడాన్ని మాత్రమే చూశాం.
కానీ ఇప్పుడు మాత్రం అంతకు మించి అన్నట్టు రసవత్తరంగా బూతులు, రొమాన్స్ పండుతోంది. ఈ సారి లేడీస్ కూడా పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు. ఇక నిత్యం సిగరెట్ జోన్ లో దమ్ము పీల్చుతూనే ఉన్నారు. ఆడ, మగ తేడా లేకుండా పచ్చి బూతులు మాట్లాడుతూ.. సిగరెట్లను దమ్ము మీద దమ్ము లాగిస్తూనే ఉంటున్నారు. కాగా యాంకర్ శివ కూడా సిగరెట్ జోన్ లోకి వెళ్లి.. అక్కడ సిగరెట్లు పంపలేదంటూ బిగ్ బాస్‌ను బండ బూతులు తిట్టేశాడు.బిగ్ బాస్‌ను పిలిచి కెమెరాలను నా వైపు తిప్పాలని చెబుతూనే.. రేపు గనక నాకు సిగరెట్లు పంపక పోతే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చేశాడు. ఇంక మొఖం మీదనే చెప్పలేని బండబూతులు తిట్టేశాడు.
Big boss : ఆమెకు పంపడంతోనే..
సిగరెట్లు పంపలేక పోతే ముందు పేర్లు ఎందుకు తీసుకున్నారంటూ వాపోయాడు. పేర్లు తీసుకుని ఇప్పుడు సిగరెట్ పంపకపోవడం ఏంటంటూ మండిపడ్డాడు. అయితే శివకు అంత కోపం రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయండోయ్. అదేంటంటే.. హౌస్ లో సిగరెట్లు తాగే తేజస్వికి సిగరెట్లు పంపించి తనకు పంపకపోయే సరికి మనోడికి మండి ఇలా చేశాడు. అయితే గతంలో ముమైత్ ఖాన్ ఇలాగే రెచ్చిపోయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. మరి ఇప్పుడు శివ కూడా ఇలాగే రెచ్చిపోతున్నాడు. ఆయన కూడా ఎలిమినేట్ అవుతాడా ఏమన్నది మాత్రం వేచి చూడాల్సిందే.