Anchor Shyamala : డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్న యాంకర్ శ్యామల.. ఫిదా అవుతున్న నెటిజన్లు
Anchor Shyamala : యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బుల్లితెర, సినిమా ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తూ మంచి మార్కులు కొట్టేసింది. సినితారలతో పలు ఇంటర్వ్యూలు కూడా చేసింది. పలు సినిమాల్లో కూడా నటించి మంచి పేరుసంపాదించుకుంది. అప్పుడప్పుడు పలు స్పెషల్ ఈవెంట్లలో మెరుస్తుంది కూడా. చిన్న వయసులోనే బుల్లితెరపై అడుగు పెట్టి పలు సీరియల్లో నటించి వెండితెరపై అవకాశాలు అందుకుంది.
యూట్యూబ్ లో ఏం చెప్పారు శ్యామల గారు.. పేరుతో ఓ ఛానల్ ప్రారంభించింది.ఇక శ్యామల తన సహా టీవీ నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు ఇషాన్ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో లైవ్ చాట్ లో ముచ్చటిస్తుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుంది.

Anchor Shyamala Dance video in Viral
తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. ఆ మధ్య ఆర్జీవీ ఓ సినిమా ఫంక్షన్ లో శ్యామలపై కామెంట్స్ చేయగా ట్రెండింగ్ లో నిలిచింది.అయితే ప్రస్తుతం శ్యామల డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ పాటకి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. క్రొప్ టాప్, లెహంగా వేసుకొని స్టెప్పులేస్తూ అందం అభినయంతో కట్టిపడేస్తోంది. దీంతో నెజన్లు కామెంట్స్ రూపంలో ప్రశంసిస్తున్నారు. లైకులు కొట్టి తెగ వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram