Anchor Shyamala : రాను రాను అంటూనే చిన్నది.. ఊపు ఊపేసిన యాంకర్ శ్యామల

Authored By aruna | The Telugu News | Published on: July 31, 2022, 6:20 pm

Anchor Shyamala : యాంకర్ శ్యామల అప్పట్లో ఓ ట్రెండ్. బుల్లితెరపై సీరియల్స్, ప్రోగ్రాంలు, వంటల షోలు అంటూ ఫుల్ బిజీగా ఉండేది. ఇక మధ్యలో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో సీజన్‌లో శ్యామల ఎంట్రీ ఇచ్చింది. మధ్యలోనే బయటకు వచ్చింది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అలా శ్యామలకు బిగ్ బాస్ ఏమీ అంతగా ఉపయోగపడలేదు. కాకపోతే కొంత మంది కొత్త స్నేహితులు ఆమె లిస్ట్‌లోకి వచ్చారు. గీతా మాధురి, శ్యామల, దీప్తి ఇలా ఓ గ్యాంగ్‌లా ఉండేవారు. యాంకర్ శ్యామల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన యూట్యూబ్ చానెల్, ఇన్ స్టాగ్రాం, రీల్ వీడియోలంటూ అభిమానులను అలరిస్తోంది.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లతోనూ బాగానే సంపాదించేస్తోంది. మొన్నటికి మొన్న యాంకర్ శ్యామల మీద ఆర్జీవీ కన్ను పడింది. ఇంత అందమైన యాంకర్‌ నా కంట ఎందుకు పడలేదు అంటూ శ్యామలను స్టేజ్ మీదే పొగిడేశాడు ఆర్జీవీ. అలా శ్యామల మరోసారి వర్మ మూలాన ట్రెండ్ అయింది. అంతకు ముందు శ్యామల చుట్టూ కాంట్రవర్సీలు బిగిశాయి. ఆమె భర్త ఓ మహిళను మోసం చేశాడని, కోటి రూపాయలు ఎగ్గొట్టాడంటూ కేసులు పెట్టారు. దీంతో శ్యామల చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. కానీ వాటి నుంచి ఇప్పుడు ఆమెకు ఉపశమనం కలిగినట్టుంది. ఇక తన కొడుకు ఇషాన్ గురించి చెబుతూ ఆమె వీడియోలు చేస్తుంటుంది.

Anchor Shyamala Latest Dance Reel Video

Anchor Shyamala Latest Dance Reel Video

యూట్యూబ్ చానెల్‌లో ఆమె చేసే వీడియోలు, చెప్పే పర్సనల్ విషయాలు, వంటింటి సంగతులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఈమె రీల్ వీడియోలు, అందులో ఆమె డ్రెస్సింగ్, వేసే స్టెప్పులు ఎక్కువగా ట్రెండ్ అవుతాయి. ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గంలోని రాను రాను అంటూనే చిన్నదో అనే పాట ట్రెండ్‌లో ఉంది. అంజలి, నితిన్ వేసిన ఈ స్టెప్పులను రీల్ వీడియోలుగా చేస్తున్నారు. తాజాగా శ్యామల కూడా తన నడుమును తెగ ఊపేసింది. రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో.. అంటూ శ్యామల స్టెప్పులు వేసింది.

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp