Anchor Sowmya Rao : సౌమ్య నీకు అది కూడా రాదా.? నెటిజన్స్ దారుణమైన కామెంట్స్…!!
Anchor Sowmya Rao : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్. ప్రస్తుతం ఈ షోకి యాంకర్ గా సౌమ్య రావు కొనసాగుతుంది. అంతకుముందు యాంకర్ గా అనసూయ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. చాలామంది ఆమె షో కి ముందు వేసే డాన్స్, తన అందం చూడడానికి ఆసక్తి చూపేవారు. ఈ క్రమంలోనే అనసూయ ప్లేస్ లో సౌమ్య రావడంతో జీవించుకోలేకపోతున్నారు. ఎప్పటికీ ఆ ప్లేస్ అనసూయదే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ లేకపోయినా ఆ ప్లేస్ ఆమెకే దక్కాలి అంటూ ప్రతి చిన్న విషయానికి సౌమ్యని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక సౌమ్య జబర్దస్త్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను, వెరైటీ వెరైటీ రీల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే రీసెంట్గా సౌమ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఓ పాటకు డాన్స్ వేస్తూ పలు స్టెప్స్ వేసింది. అయితే ఈ వీడియోలో సౌమ్య డాన్స్ బాగా చేసినప్పటికీ కొందరు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. నీ మొహానికి అది కూడా రాదా, డాన్స్ రాకుండానే జబర్దస్త్ యాంకర్ అయిపోయావా అంటూ ఫైర్ అవుతున్నారు.
మరికొందరు నీకో దండంతల్లి ఇంకోసారి ఇలా డాన్స్ చేసి మమ్మల్ని చంపకు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సౌమ్య డాన్స్ బాగున్న ఆమె అంటే గిట్టని వాళ్ళు కావాలనే ఆమెను ట్రోల్స్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో సౌమ్య ఫ్యాన్స్ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సీరియల్స్ ద్వారా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ తెలుగులో ఈటీవీలో ప్రసారమైన పలు సీరియల్స్ లలో నటించింది. దీంతో ఆమెకు ఫుల్ క్రేజ్ రావడంతో జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో సౌమ్య పేరు మారుమ్రోగిపోతుంది.