Anchor Suma : నువ్ ఎప్పుడైనా ఇలా పిలిచావా?.. రాజీవ్ మీద సుమ కనకాల ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : నువ్ ఎప్పుడైనా ఇలా పిలిచావా?.. రాజీవ్ మీద సుమ కనకాల ఫైర్

 Authored By prabhas | The Telugu News | Updated on :27 July 2022,8:45 pm

Anchor Suma : సుమ, రాజీవ్ కనకాల మధ్య ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి జోడికి మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ ఇద్దరి మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఈ ఇద్దరూ విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారనే వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే అవన్నీ కూడా రూమర్లేనని ఇద్దరూ ఖండిస్తుంటారు. అయినా కూడా రూమర్లు ఆగవు. ఆన్ స్క్రీన్‌లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది.ఎక్కువగా కలిసి షోలు చేయరు. అయితే సుమ మాత్రం అప్పుడప్పుడు షోల్లో రాజీవ్ విషయాన్ని తీస్తుంటుంది. తాజాగా రిలీజ్ చేసిన క్యాష్ షోలో సీతారామం టీం వచ్చింది. ఇందులో భాగంగా హను రాఘవపూడి, సుమంత్, తరుణ్ భాస్కర్, దుల్కర్ సల్మాన్ గెస్టులుగా వచ్చారు.

అలా మొత్తానికి మొదటి సారి స్టార్ టీం షోకు గెస్టుగా రావడంతో అందరూ షాక్ అయ్యారు. దుల్కర్ వంటి హీరో రావడంతో సుమ ఫుల్ ఖుషీ అయింది. ఇక సుమ కూడా దుల్కర్‌తో కలిసి రొమాంటిక్ స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. దుల్కర్‌‌కు లేడీ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ఈ ప్రోమోలో చూపించారు. ఇక దుల్కర్‌తో సుమ సైతం డ్యాన్సులు చేసింది.ఇందులో భాగంగానే కొందరు స్టూడెంట్లు దుల్కర్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఓ స్టూడెంట్ అయితే ఏకంగా ఐ లవ్యూ అని చెప్పింది. ఆమెను పేరు పెట్టి దుల్కర్ పిలవడంతో తెగ సిగ్గు పడిపోయింది. ఇంకో అమ్మాయి అయితే పర్సనల్ క్వశ్చన్ అడిగింది. మీరు మీ భార్యను ఏమని పిలుస్తారు అని అడిగింది.

Anchor Suma About Rajeev Kanakala in Front Dulquer Salmaan In Cash Show

జాన్ అని చెప్పుకొచ్చాడు దుల్కర్. అయితే అలా దుల్కర్ చెప్పడంతో.. సుమ మాత్రం తన పర్సనల్ విషయాలను తీసుకొచ్చింది. నువ్ ఎప్పుడైనా నన్ను అలా పిలిచావా? అంటూ స్టేజ్ మీద రాజీవ్‌ను నిలదీస్తుంది. మొత్తానికి రాజీవ్, సుమ మధ్య మాత్రం సఖ్యత ఉందని ఇలాంటి షోల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది. కానీ సుమ ఇంట్లో మాత్రం రాజీవ్ ఎక్కువగా కనిపించడు. ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని సుమ అప్పుడప్పుడు చేసే వీడియోల ద్వారా తెలుస్తుంటుంది

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది