Anchor Suma : ఎవ్వరికీ తెలియకుండా మైంటైన్ చేస్తోంది , యాంకర్ సుమలో ఈ యాంగిల్ కూడా ఉందా వామ్మో !
Anchor Suma : బుల్లితెరపై యాంకర్ సుమకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగులో అనర్గంగా మాట్లాడగలుగుతుంది. టీవీ షోలో కంటెంట్ వీకైన తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ అదిరిపోయే పంచులతో షోని సూపర్ హిట్ చేస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై నంబర్ వన్ యాంకర్ సుమ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. స్టార్ హీరో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ పక్కగా ఉండాల్సిందే. తన యాంకరింగ్ తో ఆ సినిమాను జనాలలోకి తీసుకెళుతుంది.
ఇక ఈటీవీలో 15 ఏళ్ల పాటు స్టార్ మహిళ షో కి యాంకర్ గా చేసి రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇదే కాకుండా పట్టుకుంటే పట్టు చీర, భలే ఛాన్స్ లే ప్రోగ్రామ్స్ ను సంవత్సరాల తరబడి బోర్ కొట్టకుండా నడిపింది. ఏ షోనైనా బోర్ కొట్టకుండా నడిపించగల సామర్థ్యం సుమకే సొంతం. యాంకరింగ్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సుమ ఇటీవల ‘ జయమ్మ పంచాయతీ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. దీంతో మళ్లీ షోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దూసుకెళుతోంది. అయితే సుమ గురించి తెలియని గొప్ప విషయం ఒకటి ఉంది.
సుమ ఒక గొప్ప సామాజిక కర్త. నిస్సహాయులను ఆదుకోగలిగే మంచి మనసు ఉంది. ఇంతకుముందే తాను 30 మంది విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు తెలిపింది సుమ. వాళ్ల పూర్తి బాధ్యతలను తానే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల చెన్నై కాలేజీలో జరిగిన కార్యక్రమంలో సుమ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. టీచర్ అవుదామని యాంకర్ అయ్యానని, ఈ వృత్తిలో ఉండడానికి కారణం మా అమ్మ. ఆమె తెలుగు నేర్చుకుని నాకు నేర్పించింది. ఇందులో కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన వంతు సమాజ సేవ చేస్తున్నానని వెల్లడించారు. ఇది తెలిసాకా అభిమానులు మనసున్న సుమా అని ప్రశంసలు కురిపిస్తున్నారు.