Anchor Suma : అదుపుతప్పిన యాంకర్ సుమ కామెడీ.. ఆ సింగర్‌ను పెళ్లి చేసుకుంటానన్న యాంకర్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 30 March 2022, 8:30 pm

Anchor Suma : యాంకర్ సుమ బుల్లితెరపై చేసే కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సుమ చేసే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఏ షో అయినా సరే, ఏ ఈవెంట్ అయినా సరే సుమ రంగంలోకి దిగితే అది బ్లాక్ బస్టరే. తాజాగా సుమ క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సుమ కామెడీ చేసే భాగంలో కాస్త అదుపుతప్పేసింది.

సింగర్లతో ఈ వారం ఆట ఆడించబోతోంది. ఇందులో భాగంగా భీమ్లా నాయక్ సింగర్ కౌండిన్య, మోహన భోగరాజు, హేమచంద్ర, శ్రావణ భార్గవి వచ్చారు. అయితే సుమ కామెడీ చేసే క్రమంలో సింగర్ అరుణ్ కౌండిన్యతో పరాచకాలు ఆడింది. లా లా భీమ్లా అనే పాటతో కౌండిన్యను ఏడిపించింది. అరుణ్, నేను మ్యారేజ్ చేసుకోబోతోన్నామంటూ సుమ కామెంట్ చేసింది.

Anchor Suma Fun With Singer Arun Koundinya In Cash Show

Anchor Suma Fun With Singer Arun Koundinya In Cash Show

Anchor Suma : రెచ్చిపోయిన సుమ..

అదేంటి ఇంతకు ముందే అన్నా అన్నారు కదా? అని కౌండిన్య అంటాడు. ఇక మరో సారి ఈ సారి నీకు కూతురిగా ఉంటాను అని అంటుంది సుమ. మొత్తానికి అరుణ్ కౌండిన్యను సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది. ఇక పెళ్లి చూపులు అనే స్కిట్ కూడా పెట్టేసింది. మొత్తానికి సింగర్లు వేసిన పంచ్‌లు, సుమ ఆడుకున్న తీరుకు ప్రోమో మాత్రం వైరల్ అవుతోంది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి