Anchor Suma : డబ్బు వస్తుందంటే చాలు ఏ పనైనా చేస్తుంది!!.. యాంకర్ సుమపై నెటిజన్లు ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Suma : డబ్బు వస్తుందంటే చాలు ఏ పనైనా చేస్తుంది!!.. యాంకర్ సుమపై నెటిజన్లు ఫైర్

Anchor Suma : సెలెబ్రిటీల సంపాదన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపై నటించి సంపాదిస్తుంటారు. పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ యాడ్స్‌లో నటిస్తూ సంపాదిస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం కొత్త ట్రెండ్ మొదలైంది. రెస్టారెంట్ టూర్లు అంటూ అక్కడికే వెళ్లి వారికి ప్రమోషన్ కల్పిస్తుంటారు కొందరు సెలెబ్రిటీలు. ఇక కొందరు అయితే ఇంట్లోనే కూర్చుని.. పలు ఉత్పత్తుల గురించి చెబుతూ, వాటిని రుచి చూస్తూ ప్రమోట్ చేస్తుంటారు. ఈ కేటగిరీలో సుమ ముందుంటుంది.   […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :24 August 2021,4:39 pm

Anchor Suma : సెలెబ్రిటీల సంపాదన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపై నటించి సంపాదిస్తుంటారు. పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ యాడ్స్‌లో నటిస్తూ సంపాదిస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం కొత్త ట్రెండ్ మొదలైంది. రెస్టారెంట్ టూర్లు అంటూ అక్కడికే వెళ్లి వారికి ప్రమోషన్ కల్పిస్తుంటారు కొందరు సెలెబ్రిటీలు. ఇక కొందరు అయితే ఇంట్లోనే కూర్చుని.. పలు ఉత్పత్తుల గురించి చెబుతూ, వాటిని రుచి చూస్తూ ప్రమోట్ చేస్తుంటారు. ఈ కేటగిరీలో సుమ ముందుంటుంది.

Anchor Suma Gets Trolling For Promoting FIA Foods

Anchor Suma Gets Trolling For Promoting FIA Foods

 

Anchor Suma : లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ FIA అనే ఫుడ్ సంస్థకు విపరీతమైన ప్రచారం కల్పించింది. ఎప్పుడూ వాటి గురించి చెబుతూ, వాటి ఆహార ఉత్పత్తులు అమోఘంగా ఉంటాయని చెబుతూ.. బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన అమ్మతో కలిసి FIA ఉత్పత్తులను ప్రమోట్ చేసింది. చేపల ఫ్రై, సాంబర్ చేసుకుని ఆరగించింది. అయితే ఇందులో సుమ చెప్పిన మాటలపై, చేసిన అతిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Anchor Suma Gets Trolling For Promoting FIA Foods

Anchor Suma Gets Trolling For Promoting FIA Foods

 

Anchor Suma : డబ్బు వస్తుందంటే చాలు ఏ పనైనా చేస్తుంది!!.. యాంకర్ సుమపై నెటిజన్లు ఫైర్
మీరు ఇలా చెబుతున్నారని మేం కూడా ఆర్డర్ చేసుకున్నాం.. అవి అత్యంత దరిద్రంగా ఉన్నాయి.. అలాంటి చెత్త రుచిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు.. మీరు దయచేసి ఇలాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయకండి..

Anchor Suma Gets Trolling For Promoting FIA Foods

Anchor Suma Gets Trolling For Promoting FIA Foods

 

మీకు ఏ చిన్న చాన్స్ దొరికినా డబ్బు వస్తుందంటే చాలు ఇలాంటి పనులు చేస్తుంటారు… అంటూ రకరకాలు నెటిజన్లు సుమపై ట్రోలింగ్ చేస్తున్నారు. FIA ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు వాళ్లు మీకు ఎంత ఇస్తున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది