Anchor Suma : న్యూయార్క్ నడిరోడ్డు మీద గెంతులు.. యాంకర్ సుమ వీడియో వైరల్

Authored By aruna | The Telugu News | Published on: June 3, 2022, 6:30 pm

Anchor Suma : యాంకర్ సుమ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉందన్న సంగతి తెలిసిందే. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు, వారి సత్కారాన్ని పొందేందుకు యాంకర్ సుమ న్యూ యార్క్‌కు వెళ్లింది. సుమతో పాటుగా యాంకర్ రవి తన ఫ్యామిలీని కూడా వెంటేసుకుని వెళ్లాడు. అలా సుమ, రవి ఇద్దరూ కలిసి అక్కడి ప్రోగ్రాంను హోస్ట్ చేసేశారు. అయితే గత వారం నుంచి సుమ న్యూయార్క్‌లోనే సందడి చేస్తోంది. సుమ తాను అక్కడ చేస్తున్న అల్లరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.

ఇక రెస్టారెంట్లలో రోబోలో చేసే సర్వీసుల గురించి చెబుతూ షేర్ చేసిన వీడియో బాగానే వైరల్ అయింది. తాను టాటా వారు సన్మానించిన తీరుకు సుమ ఒప్పొంగిపోయింది. ఇక ఇవన్నీ కాకుండా సుమ అయితే న్యూయార్క్ నగరంలో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన టీంతో కలిసి రోడ్డు మీద రచ్చ చేసింది. న్యూ యార్క్ నడివీధుల్లో రీల్ వీడియో చేసింది. హళహితి హబిబీ అంటూ సుమ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో సుమ మాత్రం భలే కామెడీగా కనిపించింది.

Anchor Suma Halamithi Habibo Reel Video At New york

Anchor Suma Halamithi Habibo Reel Video At New york

ఆ డ్రెస్సు, వేసిన స్టెప్పులు అన్నీ కూడా నవ్వులు పూయిస్తున్నాయి. మొత్తానికి సుమ మాత్రం అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. సుమ ఎప్పుడు రిటర్న్ అవుతుందో కానీ ఇక్కడ మాత్రం షూటింగ్‌లన్నింటికి కాస్త బ్రేక్ ఇచ్చినట్టుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే సుమ లేక వెలవెలబోతోన్నాయి. అసలే మేజర్,విక్రమ్ వంటి భారీ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమ అందుబాటులో లేకుండాపోయింది.దీంతో ఎవరెవరినో హోస్టులు పెట్టేసుకున్నారు నిర్వాహకులు. అలా సుమ లేని లోటు అందరికీ తెలుస్తోంది.

మరి న్యూ యార్క్ నుంచి సుమ ఎప్పుడు వస్తుందో, తన రెగ్యులర్ షూటింగ్‌లను ఎప్పుడు ప్రారంభిస్తుందో చూడాలి. మొత్తానికి సుమ మాత్రం ఇలా లాంగ్ వెకేషన్ వేసి చాలా ఏళ్లు అవుతోంది. పనిలో భాగంగానే అక్కడకు వెళ్లినా కూడా సుమ ఈ సారి మాత్రం ఈ వెకేషన్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినట్టుంది.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp