Anchor Suma Halamithi Habibo Reel Video At New york
Anchor Suma : యాంకర్ సుమ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉందన్న సంగతి తెలిసిందే. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు, వారి సత్కారాన్ని పొందేందుకు యాంకర్ సుమ న్యూ యార్క్‌కు వెళ్లింది. సుమతో పాటుగా యాంకర్ రవి తన ఫ్యామిలీని కూడా వెంటేసుకుని వెళ్లాడు. అలా సుమ, రవి ఇద్దరూ కలిసి అక్కడి ప్రోగ్రాంను హోస్ట్ చేసేశారు. అయితే గత వారం నుంచి సుమ న్యూయార్క్‌లోనే సందడి చేస్తోంది. సుమ తాను అక్కడ చేస్తున్న అల్లరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.
ఇక రెస్టారెంట్లలో రోబోలో చేసే సర్వీసుల గురించి చెబుతూ షేర్ చేసిన వీడియో బాగానే వైరల్ అయింది. తాను టాటా వారు సన్మానించిన తీరుకు సుమ ఒప్పొంగిపోయింది. ఇక ఇవన్నీ కాకుండా సుమ అయితే న్యూయార్క్ నగరంలో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన టీంతో కలిసి రోడ్డు మీద రచ్చ చేసింది. న్యూ యార్క్ నడివీధుల్లో రీల్ వీడియో చేసింది. హళహితి హబిబీ అంటూ సుమ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో సుమ మాత్రం భలే కామెడీగా కనిపించింది.
Anchor Suma Halamithi Habibo Reel Video At New york
ఆ డ్రెస్సు, వేసిన స్టెప్పులు అన్నీ కూడా నవ్వులు పూయిస్తున్నాయి. మొత్తానికి సుమ మాత్రం అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. సుమ ఎప్పుడు రిటర్న్ అవుతుందో కానీ ఇక్కడ మాత్రం షూటింగ్‌లన్నింటికి కాస్త బ్రేక్ ఇచ్చినట్టుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే సుమ లేక వెలవెలబోతోన్నాయి. అసలే మేజర్,విక్రమ్ వంటి భారీ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమ అందుబాటులో లేకుండాపోయింది.దీంతో ఎవరెవరినో హోస్టులు పెట్టేసుకున్నారు నిర్వాహకులు. అలా సుమ లేని లోటు అందరికీ తెలుస్తోంది.
మరి న్యూ యార్క్ నుంచి సుమ ఎప్పుడు వస్తుందో, తన రెగ్యులర్ షూటింగ్‌లను ఎప్పుడు ప్రారంభిస్తుందో చూడాలి. మొత్తానికి సుమ మాత్రం ఇలా లాంగ్ వెకేషన్ వేసి చాలా ఏళ్లు అవుతోంది. పనిలో భాగంగానే అక్కడకు వెళ్లినా కూడా సుమ ఈ సారి మాత్రం ఈ వెకేషన్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినట్టుంది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.