Anchor Suma : యాంకర్ సుమకు ఏ ఈవెంట్‌ని ఎలా వాడుకోవాలి.. ఎలా తనకు అనుకూలంగా మల్చుకోవాలో బాగా తెలుసు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎలా పెంచుకోవాలో.. యూట్యూబ్ Youtube వీడియోలతో ఆదాయాన్ని ఎలా రాబట్టుకోవాలో బాగానే తెలిసిపోయింది. సుమ ఇప్పుడు తెరపై ఎంత బిజీగా ఉంటుందో.. తెర వెనక అంటే.. ఇలా సోషల్ మీడియాలోనూ అంతే బిజీగా ఉంటోంది. ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ వీడియోలతో సుమ ఫుల్ సందడి చేస్తోంది. ఇక సుమ చేసే రీల్ వీడియోలు అయితే మరింతగా పాపులర్ అవుతుంటాయి.
Anchor Suma : తాజాగా యూట్యూబ్ చానెల్ కోసం సుమ ప్లాన్ వేసింది. కృష్ణాష్టమి Krishnastami టే మనకు అందరూ చిన్ని కృష్ణుళ్లు కనిపిస్తుంటారు. ప్రతీ ఒక్కరూ తమ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను కృష్ణుడిగానో, రాధగానో మేకోవర్ చేస్తుంటాం. అయితే ఈ ఐడియాను సుమ వాడేసింది. అందరూ ఇలా తమ తమ పిల్లలను రెడీ చేసి తనకు పంపిస్తే.. వాటిని తన వీడియోల్లో ప్లే చేస్తాను అని చెప్పింది. దీంతో కుప్పలు తెప్పలుగా వీడియోలు వచ్చి పడ్డాయట. అలా ఎంతగా వచ్చాయంటే.. ఒక్క వీడియో చేస్తే సరిపోనంతగా వచ్చాయట. చాలా ఎక్కువ నిడివి ఉన్నవి పక్కన పెట్టేశానని, కొన్ని వాటిని మాత్రం ఇప్పుడు చూపిస్తాను అని చెప్పింది.
అలా కొన్ని వీడియోలను పెట్టింది. చిన్ని కృష్ణుడు, రాధల వీడియోలను చూస్తూ.. కౌంటర్లు, కామెంటరీ చేసింది. ఈ వీడియోలో సుమ అందరినీ నవ్వించేసింది. చిన్న పిల్లలు చేసే అల్లరి, వారి క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ మీద సెటైర్లు వేసింది. ప్రస్తుతం ఈ వీడియోను జనాలు అంతా చూస్తున్నారు. మా వీడియో పెట్టారా? లేదా? ఎవరి వీడియోలు పెట్టిందా? అంటూ ఇలా జనాలు అంతా ఆ వీడియోను కచ్చితంగా చూస్తారు. ఒకవేళ తమ పాప, బాబుల వీడియోలు పెట్టి ఉంటే. వాటిని షేర్లు లైకులు చేస్తుంటారు. అలా ఎటు చూసినా సుమకు ఈ వీడియో ద్వారా లాభం బాగానే ఉండేట్టే కనిపిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ఈ వీడియోను చూసేశారు. అసలే సుమ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.