Anchor Suma : పని మనిషితో మసాజ్.. ఫుల్ చిల్ అవుతున్న యాంకర్ సుమ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : పని మనిషితో మసాజ్.. ఫుల్ చిల్ అవుతున్న యాంకర్ సుమ

 Authored By prabhas | The Telugu News | Updated on :30 April 2022,10:00 pm

Anchor Suma : యాంకర్ సుమ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. తన సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా టూర్ల మీద టూర్లు వేస్తోంది. గుళ్లుగోపురాలు అంటూ తిరుగుతోంది. మామూలుగా అయితే సినిమా ప్రమోషన్లు అనేవి సుమకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి తన సినిమానే ప్రమోట్ చేసుకుంటూ ఉండటంతో కొత్తగా ఉన్నట్టుంది. మొత్తానికి సుమ మాత్రం తన జయమ్మ పంచాయితీ సినిమాను బాగానే ప్రమోట్ చేస్తోందిఅయితే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకే దిక్కు లేకుండా పోతోంది

ఇలాంటి తరుణంలో సుమ సినిమాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. టాక్ బాగా లేకపోతే ఏ స్టార్ ఉన్నా కూడా సినిమాలను ఎవ్వరూ చూడటం లేదు. మరి సుమ ప్రధాన పాత్రలో అంటే చూడటం కూడా కష్టమే. అయితే సుమ మాత్రం వీలైనంతగా తన సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది.స్టార్ హీరోలతో సినిమాను ప్రమోట్ చేయించుకుంటోంది. ఇక ఇలా సినిమా ప్రమోషన్ల కోసం తిరుగుతూ ఉన్న సుమ కాస్త రిలాక్స్ అయినట్టు కనిపిస్తోంది.

Anchor Suma Relaxing AFter Jayamma Panchayathi Promotions

Anchor Suma Relaxing AFter Jayamma Panchayathi Promotions

సుమ ఇంట్లో ఉండే పని మనిషి మని గురించి అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది. సుమ షేర్ చేసే ఫన్నీ వీడియోల్లో ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఆమెను సుమ ఎప్పుడూ కూడా ఆట పట్టిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె మసాజ్ చేస్తుంటే సుమ చిల్ అయింది.తల్లో అంతా కూడా సినిమా ప్రమోషన్లే ఉన్నాయి.. నువ్ ఇలా మసాజ్ చేస్తే కాస్త అయిన రిలాక్స్ అవుతాను అంటూ సుమ చిల్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను సుమ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది