Surekha Vani : సురేఖా వాణి బర్త్ డేకు కాస్ట్‌లీ గిఫ్ట్.. సుప్రిత మామూల్ది కాదు

 Authored By prabhas | The Telugu News | Updated on :30 April 2022,9:30 pm

Surekha Vani : సురేఖా వాణి, సుప్రిత ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు. సురేఖా వాణి బర్త్ డే అంటూ నిన్న కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మందు బాటిళ్లతో ఈ తల్లీకూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక తల్లికి మందు పోస్తూ సుప్రిత చేసిన రచ్చ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఇద్దరూ కలిసి మందు, చిందులతో బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.ఇక మామూలుగానే సురేఖ, సుప్రిత ఇద్దరూ కూడా పబ్బులు, పార్టీలు, బీచ్‌లంటూ తెగ తిరుగుతుంటారు.

కరోనా వల్ల రెండేళ్లు విదేశాలకు వెళ్లలేదు. దీంతో ఇప్పుడు థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడి థాయ్ మసాజ్‌ను ఎంజాయ్ చేశారు. మొత్తానికి బ్యాంకాక్ వీధుల్లో సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ కూడా నానా రచ్చ చేశారు. ఇక వారు దిగిన ఫైవ్ స్టార్ హోటల్ వీడియోలను కూడా షేర్ చేశారు.అక్కడే బర్త్ డే పార్టీలను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే సురేఖా వాణికి సుప్రిత అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్టుంది. డైమండ్ రింగులు, చెవి రింగులను ఇచ్చినట్టు కనిపిస్తోంది.

Supritha Special Gift To Surekha Vani Birthday

Supritha Special Gift To Surekha Vani Birthday

వీటిని చూపిస్తూ సురేఖా వాణి తెగ మురిసిపోయింది. నువ్వే నాకు పెద్ద గిఫ్ట్‌వి అయినా కూడా ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ సుప్రిత మీద సురేఖా వాణి తన ప్రేమను కురిపించింది.మొత్తానికి తల్లికి మాత్రం ఇలా పుట్టిన రోజును మాత్రం సుప్రిత గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఇలా కాస్ట్ లీ గిఫ్ట్‌ను కూడా ఇచ్చి తల్లిని సర్ ప్రైజ్ చేసింది. మొత్తానికి సురేఖా వాణి బర్త్ డే మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి