Sudigali Sudheer :  సుడిగాలి సుదీర్ ఎంగేజ్‌మెంట్‌ బిగ్ ట్విస్ట్‌.. ఐనా అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి

Advertisement

Sudigali Sudheer : సుడిగాలి సుదీర్ ఈ పేరు ను తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లి తెర మాత్రమే కాదు వెండి తెర పై కూడా వెలుగుతూనే ఉన్నాడు హీరో గా వరుస సినిమాలను చేస్తున్నా ఈ బుల్లి తెర సూపర్‌ స్టార్ తాజాగా ఒక చిన్న వీడియో తో మరో సారి వార్తల్లో నిలిచాడు. గతం లో రష్మీ తో ప్రేమ వ్యవహారం అంటూ తెగ ప్రచారం జరగడం తో సుడిగాలి సుధీర్ కి మంచి పబ్లిసిటీ దక్కింది. ఈ మధ్య కాలం లో కాస్త చనువు తగ్గినట్లుగా అనిపిస్తుంది.

Advertisement

ఎందుకంటే ఆమె పెళ్లి అయిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. పెళ్లి విషయం ఏమో కానీ తాజాగా సుధీర్ ఎంగేజ్మెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో గా విడుదలైన సుధీర్ ఎంగేజ్మెంట్ వీడియో అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. సుధీర్ తో ఆ వీడియో లో కనిపించిన అమ్మాయి పేరు తేజస్వి నాయుడు. మోడల్ గా ఎన్నో యాడ్స్ లో మరియు బుల్లి తెరపై పలు కార్యక్రమాల్లో బ్యాక్ నుండి కనిపించిన ఈమె ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ లో సుధీర్ కి జోడిగా కామెడీ స్కిట్ లో కనిపించబోతుంది.

Advertisement
sudigali sudheer engagement promo interesting update
sudigali sudheer engagement promo interesting update

తేజస్వి నాయుడు తో ను సుదీర్ నిజంగానే లవ్ ఎఫైర్ లో ఉన్నాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం క్లారిటీ లేదు. ఇప్పటికే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ లో లవ్ ఎఫైర్ లు చాలా ఎక్కువ అయ్యాయి. ఈ సందడిలో అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ తెలియడం లేదు. సుధీర్ అభిమానులు వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగే ఉసూరుమనిపిస్తారా లేదంటే అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తారా అనేది చూడాలి.

Advertisement
Advertisement