Anchor Suma : నాతో ఏవేవో పనులు చేయిస్తున్నారు.. క్యాష్ టీంపై యాంకర్ సుమ ఆరోపణలు
Anchor Suma : తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ గురించి తెలియని వారు ఉండరంటే అతియోశక్తి కాదు. ఏ చానల్ చూసినా ఆమె కనిపిస్తోంది. టీవీ షోలే కాకుండా.. సినిమా ఈవెంట్స్‌లో కూడా సుమ ఉండాల్సిందే. తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్న సుమ.. యాక్టివ్‌నెస్, పంచ్ డైలాడ్స్, కామెడీ టైమింగ్ సూపర్ అనే చెప్పాలి. అందుకే ఇన్నేళ్లు గడిచినా సుమకు తెలుగులో డిమాండ్ తగ్గడం లేదు. ఆమెకు పోటీ ఇచ్చే విధంగా మరో లేడీ యాంకర్ కూడా లేదనే చెప్పాలి.

anchor suma sensational comments on cash program
ముఖ్యంగా క్యాష్ షోలో సుమ సెలబ్రిటీలతో చేసే సందడి అంత ఇంతా కాదు. సెలబ్రిటీలపై కూడా తనదైన శైలిలో పంచులు వేస్తుంటుంది. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌కు యమున, వరలక్ష్మి, ఆమని, దివ్య వాణి గెస్ట్‌లుగా వచ్చారు. వీరితో సుమ బాగానే సందడి చేసింది. పంచ్ డైలాగ్స్ కూడా పేల్చింది. అయితే ఈ దీపావళి స్పెషల్ ఏపిసోడ్‌లో క్యాష్ టీమ్‌పై సమ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Anchor Suma క్యాష్ షోలో సుమ రచ్చ..

anchor suma sensational comments on cash program
టాస్క్‌లో భాగంగా ఆమనిని జుంబా ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఆమనిని, తాను అసిస్టెంట్ అని, మిగిలినవారిని స్టూడెంట్స్‌గా సుమ పేర్కొంటుంది. అయితే వరలక్ష్మి మాత్రం తమను దీపావళి ప్రోగ్రామ్ అని పిలిచారు.. మీరు జుంబా అని చెప్పిఉంటే..? అని ఏదో అనబోయింది. అప్పుడే కలగజేసుకున్న సుమ.. ‘ఎవరితో చెప్పామంటావు అక్క నన్ను కూడా యాంకరింగ్ అని తీసుకొచ్చి.. ఏమేం చేయిస్తున్నారో చూడు అసలు’ అని పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
