Anchor Suma : సుమనే గుర్తు పట్టలేదట.. వామ్మో అంటూ గింజుకున్న యాంకర్

Authored By aruna | The Telugu News | Published on: August 26, 2022, 8:40 pm

Anchor Suma : యాంకర్ సుమ అంటే గుర్తు పట్టని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె తెలియనవారు.. గుర్తు పట్టని వారెవ్వరూ ఉండరు. కానీ అలాంటి సుమకే భంగపాటు ఎదురైంది. ఆమె ఓ స్వీట్ షాపుకు వెళ్లింది. అక్కడ పని చేసే వాళ్లు సుమను గుర్తు పట్టలేదు. దీంతో సుమ అక్కడే అవాక్కైంది. నన్ను గుర్తు పట్టలేదంటూ సుమ తెగ బాధపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలు జరిగిందేంటో ఓ సారి చూద్దాం. సుమ తన యూట్యూబ్ చానెల్‌ను వీలైనంతగా ప్రమోట్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది. అదే సమయంలో డబ్బులు కూడా సంపాదించాలని చూస్తోంది.

అందుకే తన యూట్యూబ్ చానెల్ ప్రమోషన్స్, షాపింగ్ మాల్ ప్రమోషన్స్ కూడా ఒకే సారి చేస్తోంది. సుమ షాపింగ్ చేస్తోన్న షాపింగ్ మాల్ గురించి వివరిస్తూ తన యూట్యూబ్ చానెల్‌లో వీడియో చేస్తోంది. అలా షాప్ ఫేమస్ అవుతోంది. తన వీడియోల ద్వారా ఫ్యాన్స్ కూడా ఎంటర్టైన్ అవుతున్నారు. వ్యూస్ కూడా ఫుల్లుగా వస్తున్నాయి. అందుకే సుమ అటు షాపింగ్ చేస్తూనే ఇటు వీడియోలు చేస్తోంది. ఈ మధ్య పండుగలు ఎక్కువగా వస్తున్నాయ్ కదా? అని స్వీట్ షాపింగ్ చేసింది. ఆలివ్ అంటూ నిజాయితీ గల మిఠాయిలు అనే షాప్‌కు వెళ్లింది. అక్కడంతా తిరిగింది. ఆ షాపుకు కావాల్సినంత పబ్లిసిటీ చేసింది.

షాపులో అన్ని రకాల పదార్థాలు తిని టేస్ట్ చూసి చెప్పింది. ఇలా ఎన్ని లక్షలు, కోట్లు ఇస్తే పబ్లిసిటీ చేస్తుంది. వస్తుంది. మొత్తానికి ఆ మిఠాయి కొట్టులో అందరూ హిందీ వాళ్లే ఉన్నారు. అందులో ఎవ్వరికీ కూడా సుమ తెలీదట. నేను ఎవరో మీకు తెలీదా? అని సుమ అడిగితే.. వారంతా కూడా తెల్లమొహాలు వేశారు. దీంతో తాను ఎవ్వరికీ తెలియదా? తనను గుర్తు పట్టలేదా? అంటూ షాపులోనే కామెడీ చేసేసింది. మొత్తానికి సుమ అంటే తెలియని వాళ్లు కూడా ఉన్నారా? అని జనాలు అనుకుంటున్నారు.

aruna

No bio available for this author.

  1. "Revanth Reddy : జగన్ – కేసీఆర్ రహస్య ఒప్పందంపై రేవంత్ రెడ్డి ఫైర్.. తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిప్పులు!"

  2. "Samantha Baby Boy : బిగ్ బ్రేకింగ్‌ న్యూస్‌.. సమంతకు పండంటి మగబిడ్డ.. బాబుకు పేరు ఇదే..!"

  3. "Chicken Price : బ్రేకింగ్‌న్యూస్‌.. చికెన్ ప్రియులకు పండగే… రూ.99కే కిలో చికెన్..!"

  4. "Malaysia Visa Rules : భారతీయులకు మలేషియా బిగ్ షాక్.. 2027 నుంచి వీసా తప్పనిసరి! అసలు కారణమేంటి?"

  5. "Gunde Ninda Gudi Gantalu Today Episode : రవికి నీతూ రూ.20 కోట్ల బంపరాఫర్.. ఆమె ఆస్తిపై ప్రభావతి కన్ను!"

  6. "Gold Rate Today : పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనేవారికి భారీ గుడ్‌న్యూస్ .. 2026 నవంబర్ 20 22K, 24K పసిడి ధరలు ఎంతంటే?"

  7. "RK Roja : రోజాకు పార్టీలోనే అడ్డంకులు?.. చిత్తూరు వైసీపీలో ఏం జరుగుతోంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp