Anchor Suma : సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు పచ్చబొట్టుగా.. రాజీవ్ కననాలకు షాక్!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 3 November 2021, 8:40 pm

Anchor Suma : పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కాబోతోన్నారు. సుమ ప్రధాన పాత్రలో రాబోతోన్న ఈ చిత్రంతో విజయ్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా బలగ ప్రకాష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

anchor suma tattoo goes viral

anchor suma tattoo goes viral

ఆ ప్రీ లుక్‌లో సుమ సంప్రదాయబద్దంగా, గృహిణిగా కనిపిస్తున్నారు. తన భర్త వెంకన్న పేరును చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకుంది. ఇక ఈ పోస్టర్‌లో రోలు, రోకలి కూడా కనిపిస్తోంది. ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అనుష్ కుమార్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

Anchor Suma సుమ కొత్త సినిమా..

anchor suma tattoo goes viral

anchor suma tattoo goes viral

నవంబర్ 6న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్‌ను రివీల్ చేయబోతోన్నారు. మొత్తానికి సుమ మాత్రం కొత్త అవతారాన్ని ఎత్త బోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతోండగా.. ఇందులో సుమ ప్రయోగాత్మక పాత్రను పోషిస్తోన్నట్టు కనిపిస్తోది. మొత్తానికి సుమ ఇప్పుడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తోందట. వీటి కోసం కోట్లలో రెమ్యూనరేష్ తీసుకుంటుందని సమాచారం. మొత్తానికి చేతి మీద మాత్రం సినిమాలో తన భర్త పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుంది సుమ. మరి రియల్ లైఫ్‌లో రాజీవ్ కనకాల పేరును టాటూగా వేయించుకుందో లేదో.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp