actress Varalaxmi : కోవిడ్‌లో అలాంటి పనులే చేశాం.. సీనియర్ నటి వరలక్ష్మీ ..!
actress Varalaxmi సీనియర్ నటి వరలక్ష్మీ ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. దక్షిణాదిన చాలా సినిమాల్లో ఆమె నటించారు. బాలనటిగా సీని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మీ.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో మెప్పించారు. లీడ్ క్యారెక్టర్స్‌తో పాటుగా సపోర్టింగ్ రోల్స్‌లో ఆమె నటించారు. సినిమాల్లో ఎక్కువగా చెల్లెలి పాత్రల్లో ఆమె కనిపించారు. అంతేకాకుండా కొన్ని సీరియల్స్‌లో కూడా నటించారు.

Senior actress Varalaxmi comments in Cash Program
తాజాగా వరలక్ష్మీ.. సుమ యాంకర్‌గా ఉన్న క్యాష్ షోకు విచ్చేశారు. ఆమెతో పాటు యమున, ఆమని, దివ్య వాణిలు కూడా గెస్ట్‌లుగా వచ్చారు. ఇక, షోలో భాగంగా సూదిలో దారం అనే గేమ్ ఆడించగా.. సూదిలో దారం పెట్టడానికి మిగతా నటీమణులు ఇబ్బంది పడ్డారు. కానీ వరలక్ష్మీ మాత్రం సూదిలోకి చాలా తేలికగా దారాన్ని ఎక్కించింది. దీంతో సుమ.. అంతంతా కళ్లు ఉంటే కనిపించక ఇంకేం అవుతాయి చెప్పండి అని అంది.
actress Varalaxmi కోవిడ్ మరణాలతో వరలక్మీ ఎమోషనల్..
దీనికి వరలక్ష్మీ స్పందిస్తూ.. కాదండి.. కోవిడ్‌లో పనిలేక కుట్టుకుంటూ బతుకుతున్నామని సింబాలిక్‌గా చెప్పాను అని అంటుంది. దీంతో అక్కడున్న మిగతావారు ఒక్కసారి నవ్వేశారు. ఇక, ఇదే షోలో కోవిడ్ తన కుటుంబంలో విషాదం నింపిందని చెప్పిన వరలక్ష్మీ.. భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబంలో ఐదుగురు మరణించారని చెప్పింది. తన చెల్లి సరస్వతి భర్త కోవిడ్ మరణించాడని.. సరస్వతి కూడా చనిపోతుందని అనుకున్నామని కానీ కష్టపడి బతికించుకున్నామని కంటతడి పెట్టింది. తన చెల్లి ఎంత బాధ అనుభవించిందో చెప్పింది. దీంతో యాంకర్ సుమతో పాటుగా మిగిలిన గెస్ట్‌లు ఆమెను ఓదార్చారు.
