Anchor Suma : సినీ పరిశ్రమలో రూమర్స్ సహజం.. మా విడాకుల విషయంలో చాలా బాధపడ్డానన్న యాంకర్ సుమ
Anchor Suma : తెలుగు సినిమా పరిశ్రమలో యాంకర్ సుమ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన టాలెంట్‌తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. సుమ అంటే ఒక సంచలనం. ఆమె పేరు వింటే చాలా తెలుగు ప్రేక్షకులకు ఆమె నోటి నుంచి వచ్చే స్పష్టమైన తెలుగు వినపడుతుంది. ఎలాంటి షో లో అయినా సరే ఉత్సాహంగా ఆమె పాల్గొనే విధానం ఆమె టైమింగ్ అన్నీ కూడా నచ్చుతాయి. ఇక సుమా విషయంలో ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటీ అనేది చాలా మందికి తెలియదు. అభిమానులు, ఫ్యామిలీ అనే చెబుతుంటుంది. కొన్ని దశాబ్ధాలుగా ప్రేక్షకులని అలరిస్తున్న సుమ ప్రస్తుతం జయమ్మ పంచాయతీ అనే సినిమాతో పలకరించేందుకు సిద్ధమైంది.
జయమ్మ పంచాయతీ సినిమా మే 6న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ లో తెగ పాల్గొంటుంది. ఇటీవల అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన సుమకు అలీ.. తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. ‘సంవత్సరం క్రితం వరకు నువ్వు రాజీవ్ విడిపోయారని..నువ్వు ఒక ఇంట్లో ఉంటున్నావని… అతను ఒక ఇంట్లో ఉంటున్నారని’ అని అడిగాడు. దానికి సుమ సమాధానం ఇస్తూ.. ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వటం అనేది వాస్తవమే… ఈ 23 ఏళ్లలో ఎన్ని గొడవలు.. కానీ ఒకటి మత్రం నిజం.. భార్యభర్త విడాకులు తీసుకోవడం అనేది ఈజీనే.. కానీ ఓ తల్లిదండ్రులుగా ఇట్స్ డిఫికల్ట్ అన్నారు.రాజీవ్‌తో నాకు పెళ్లయి 23ఏళ్లు అవుతుంది.

Anchor Suma with Rajiv Kanakala clears the rumors
Anchor Suma : యాంకర్ సుమ క్లారిటీ..
ఈ 23ఏళ్లలో మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఇలా రూమర్స్ వచ్చినప్పుడుల్లా మా పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా పుకార్లకు కొంతవరకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాను. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణమే. సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి తప్పదు. వీటి వల్ల మానసికంగా బాధ కలిగినా అందుకు అలవాటుపడి ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. సుమ విషయానికి వస్తే.. సుమ మళయాళి అయినా పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. సుమ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో సుమ చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం అయింది.