Anchor Syamala : ఆలస్యంగా అయినా నా కోరిక నేరవేరిందంటున్న యాంకర్ శ్యామల..?
Anchor Syamala : జీవితంలో కొందరు తమ కోరిక నేరవేర్చుకోవాలని కలలు కంటారు. కానీ అందులో కొందరే సఫలీకృతులవుతారు.మిగతా వారు తమకు నచ్చినా నచ్చకపోయినా ఏదో కాలం వెల్లదీస్తుంటారు. వాస్తవానికి మనం కన్న కలలు నేరివేరితే దాని ద్వారా వచ్చే కిక్కే వేరు. అందుకే ప్రతిఒక్కరూ తమ కలలు నేరవేర్చుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. అందులో కొందరు త్వరగా తమ కలలను నేరవేర్చుకుంటే మరికొందరు ఆలస్యంగా నేరవేర్చుకుంటారు. యాంకర్ శ్యామల తెలుగు ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే.
యాంకర్‌గా తన ప్రస్థానం ప్రారంభించి నెమ్మదిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తుంది. సినిమాల్లో హీరోలకు అక్క,వదినా.. పిల్లలకు తల్లి పాత్రలు పోషిస్తోంది. ఇప్పటికీ పలు షోలు చేస్తున్న శ్యామల.. బుల్లితెరపై సీరియల్స్ లో కూడా చేస్తోంది. ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చిన శ్యామల.. యాంకర్ అయ్యింది. ఆ తర్వాత బుల్లితెర క్వీన్‌గా సెటిల్ అయ్యింది. హీరోయిన్ వంటి అందం ఉన్నా శ్యామలకు మాత్రం హీరోయిన్ అవకాశాలు రాలేదు. ఒకప్పుడు యాంకర్ శ్యామలకు చాలా డిమాండ్ ఉండేది.

Anchor Syamala latest video viral on instagram
Anchor Syamala : శ్యామల కోరిక ఇన్నాళ్లకు నేరివేరిందట..
వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా ఉండే టైంలోనే సినిమాలు కూడా చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేసింది. శ్యామల ఇండస్ట్రీలో ఆల్ రౌండర్‌గా చేస్తోంది. యాంకరింగ్, యాక్టింగ్‌తో పాటు పలు ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఈమె పాపులారిటీ బాగా పెరిగిపోయింది. బిగ్ బాస్ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన శ్యామల.. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.తాజాగా శ్యామల తన చిరకాల కోరికను తీర్చుకున్నట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా ప్రకటించింది. రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న శ్యామల.. తనకు పల్లకిలో ఊరేగాలని కోరిక ఉండేదట.. దానిని తాజాగా నేరవేర్చుకుందట.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram