Anchor Shyamala : కోమటిరెడ్డి వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల సెటీరికల్ కామెంట్స్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Anchor Shyamala : కోమటిరెడ్డి వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల సెటీరికల్ కామెంట్స్…!

Anchor Shyamala : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పోలింగ్ కు మరో వారం రోజులు గడువు ఉండడంతో అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరి ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. ఒక్క క్షణం కూడా వృధా కాకుండా గడపగడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థులు కలుస్తూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున ప్రముఖ సినీ నటులు యాంకర్లు కూడా ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 May 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Anchor Shyamala : కోమటిరెడ్డి వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల సెటీరికల్ కామెంట్స్...!

Anchor Shyamala : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పోలింగ్ కు మరో వారం రోజులు గడువు ఉండడంతో అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరి ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. ఒక్క క్షణం కూడా వృధా కాకుండా గడపగడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థులు కలుస్తూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున ప్రముఖ సినీ నటులు యాంకర్లు కూడా ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్త్ ఆర్టిస్టులు మెగా హీరోలు సైతం ప్రచారాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు వైసీపీ పార్టీ తరఫున ప్రముఖ యాంకర్ శ్యామల ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాలలో చాలా చురుగ్గా పాల్గొంటూ పవన్ మరియు చంద్రబాబు పై కామెంట్ చేసిన యాంకర్ శ్యామల తాజాగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేసినట్లుగా అర్థమవుతుంది.

Anchor Shyamala : మంత్రి కోమటిరెడ్డి వీడియో…

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. తెలంగాణలో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలను రక్షిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సాధించే సీట్లపై పలుచోట్ల వేరువేరు సందర్భాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు రకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ నామినేషన్ ర్యాలీలో మాట్లాడిన కోమటిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి రెండు ఎంపీ సీట్లు కూడా రావని వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. అదేవిధంగా మరోచోట కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు కూడా రావని వస్తే తాను రాజకీయాలు చేయనని సవాల్ విసిరారు. అయితే కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తాజాగా ప్రముఖ యాంకర్ శ్యామల షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Anchor Shyamala కోమటిరెడ్డి వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల సెటీరికల్ కామెంట్స్

Anchor Shyamala : కోమటిరెడ్డి వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల సెటీరికల్ కామెంట్స్…!

Anchor Shyamala శ్యామల సెటరికల్ ట్విట్…

ఈ సందర్భంగా శ్యామల కోమటిరెడ్డి మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ…వారం వ్యవధిలోని 2 నుండి 8 వచ్చింది. మరో వారం రోజుల్లో 8 నుండి ఎక్కడికి పోతుందో…? ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని అంటూ క్యాప్షన్ రాసుకోచ్చారు. యాంకర్ శ్యామల బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేసిన ఈ సేటారికల్ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్ పై నేటిజనులు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మీరు నిజం చెప్పారని కామెంట్స్ చేస్తుంటే…నీకు రాజకీయాలు అవసరమా అంటూ మరికొందరు మండిపడుతున్నారు…మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది