Anchor Syamala : అది తాగితే మంచిదట.. యాంకర్ శ్యామల

Authored By Sam C | The Telugu News | Published on: March 4, 2022, 8:20 am

Anchor Syamala : యాంక‌ర్ శ్యామ‌ల బుల్లితెర యాంక‌ర్స్‌లో ఫేమ‌స్ యాంక‌ర్.ఈ క్రేజ్‌తోనే బిగ్ బాస్ షోలోకి కూడా అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం యాంక‌ర్‌గా దూసుకుపోతున్న శ్యామ‌ల ఇప్ప‌టికీ త‌న అంద‌చందాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది. ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ ఆర్జీవీ క‌ళ్ల‌ల్లో ప‌డ‌డంతో ఆయ‌న వెంట‌నే ఈవిడ‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్జీవీ మైక్ తీసుకోగానే యాంకర్ శ్యామలని ఉద్దేశించి.. ”అసలు ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నారు” అంటూ కామెంట్ చేశారు. దీంతో శ్యామల ఆశ్చర్యపోయింది. అలాగే యాంకర్ శ్యామల ఆర్జీవీని తోపు, రౌడీ, గుండా.. అనే పదాలని వాడుతూ పొగిడింది.

దానికి కూడా ఆర్జీవీ సమాధానమిస్తూ.. ”నువ్వు నన్ను తోపు, రౌడీ ఇలా అన్నావు వాటితో పాటు నేను రాస్కెల్ కూడా” అంటూ తనపైనే సెటైర్ వేసుకున్నారు ఆర్జీవీ.ఏదేమైన శ్యామ‌ల ఇప్ప‌టికీ బుల్లితెర‌పై దూసుకుపోతూ సోష‌ల్ మీడియాలోను సంద‌డి చేస్తుంది. బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న తెరపై తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూనే, అందాలతో అందరినీ కట్టిపడేయడం శ్యామల సొంతం. తాజాగా ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్ క్రాస్ అయ్యారు. దీంతో థాంక్యూ 1 మిలియన్ ఫ్యామిలీ అంటూ ఇటీవ‌ల తన ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Anchor Syamala good to drink it

Anchor Syamala good to drink it

ఇక తాజాగా త‌న ఇన్‌స్టాలో వీడియో చేసి సంద‌డి చేసింది.మ‌హారాష్ట్ర డ్రింక్ కొక‌మ్ టేస్ట్ చేసిన శ్యామ‌ల ఇది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండ‌ని పేర్కొంది. సుగంధ పానీయంలా ఉంది అంటూ వీడియోలో తెలిపింది. శ్యామ‌ల వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది. యాంకర్ శ్యామల టీవీ నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ మధ్య వీరిద్దరూ విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారనే వార్త‌లు జోరుగా వచ్చాయి. దీనిపై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ బ‌దులిచ్చింది శ్యామ‌ల‌.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp