Vishnu Priya : నా చుట్టూ అలాంటి వారే ఉన్నారు.. యాంకర్ విష్ణుప్రియ పోస్ట్ వైరల్
Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగానే ఉంటోంది. కానీ యూట్యూబ్‌లో మాత్రం ట్రెండ్ అవుతోంది. బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి చేసిన ఫోక్ సాంగ్ టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. జరీ జరి జారే పంచెకట్టు అంటూ విష్ణుప్రియ ఊపిన అందాలకు సోషల్ మీడియా ఊగిపోయింది. విష్ణుప్రియ అందాల ఆరబోతకు, ఆ పాటలు ఊపిన ఊపుకు నెటిజన్లకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండ్ అవుతూనే ఉంది. ఆ పాటతో ఒక్కసారిగా విష్ణుప్రియ వైరల్ కాసాగింది. తన డ్యాన్సులు, రీల్ వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
అయితే ఈ మధ్య డ్యాన్స్ మీద కాకుండా.. ఫైట్స్, యాక్షన్, స్టంట్స్ మీద ఫొకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. స్టంట్స్ కోసం స్పెషల్‌గా విష్ణుప్రియ కోచింగ్ తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. మామూలుగానే వర్కవుట్లు అంటూ జిమ్‌లోనే ఉంటోంది విష్ణుప్రియ. ఇక ఆమెకు భక్తి భావం ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. ఈషా ఫౌండేషన్, సద్గురును ఎక్కువగా ఫాలో అవుతుంటుంది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా భవానీ దీక్షను తీసుకున్నట్టు ఉంది. ప్రస్తుతం గుళ్లు గోపురాలు అంటూ తిరిగేస్తోంది.దసరా పండుగ మూడ్లో విష్ణుప్రియ ఉంది.

Anchor Vishnu Priya Post on Her FRiends
అయితే విష్ణుప్రియ ఎప్పుడు ఎక్కడ ఎలా బిజీగా ఉన్నా కూడా నెట్టింట్లో మాత్రం తన అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది. ఆమె షేర్ చేసే కొటేషన్లు మాత్రం వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె అదిరిపోయే కొటేషన్ షేర్ చేసింది. కొందరు మన మాటలను అర్థం చేసుకోలేరు. కానీ కొందరు మాత్రం మన మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటారు అని ఓ కొటేషన్ ఉంది. దీన్ని షేర్ చేస్తూ విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. నా చుట్టూ అందరూ అలాంటి వారే ఉన్నారు.. నేను మాట్లాడకపోయినా నన్ను అర్థం చేసుకుంటారు.. నన్ను భరిస్తుంటారు.. నా పిచ్చి, మంచిని, తిక్కని భరిస్తుంటారు.. అని తన ఫ్రెండ్స్ గురించి చెప్పుకొచ్చింది.