Vishnu Priya : ఆ త‌ప్పిదాలే విష్ణు ప్రియ బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేసింది.. కాని బాగానే సంపాదించిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : ఆ త‌ప్పిదాలే విష్ణు ప్రియ బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేసింది.. కాని బాగానే సంపాదించిందిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 December 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Vishnu Priya : ఆ త‌ప్పిదాలే విష్ణు ప్రియ బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేసింది.. కాని బాగానే సంపాదించిందిగా..!

Vishnu Priya : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 8కి కేవ‌లం వారం రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. డిసెంబ‌ర్ 15 బిగ్ బాస్ ఫినాలే కార్యక్ర‌మం జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే 14 వారం వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. శనివారం ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. టాప్ 5లో అవకాశం కోల్పోయింది విష్ణుప్రియ. అస‌లు ఆమె ఇక్కడివరకూ రావడమే గొప్పవిఫయం అనుకోవాలి. ఎందుకుంటే హౌస్ లో పృధ్వీతో లవ్ ట్రాక్ తప్పించి గేమ్ పై పెద్దగా శ్రద్దపెట్టలేదు విష్ణు. అంతే కాదు బాగా ఆడగలిగి ఉంది, ఈ సీజన్ లో లేడీ విన్నర్ అవ్వాల్సిన అన్ని లక్షణాలు ఉండి కూడా.. పృధ్వీ వెంట పడుతూ.. తన గ్రాఫ్ ను తానే తగ్గించుకుంది.

Vishnu Priya ఆ త‌ప్పిదాలే విష్ణు ప్రియ బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేసింది కాని బాగానే సంపాదించిందిగా

Vishnu Priya : ఆ త‌ప్పిదాలే విష్ణు ప్రియ బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేసింది.. కాని బాగానే సంపాదించిందిగా..!

Vishnu Priya ప్ర‌స్థానం ముగిసింది..

ఉన్నన్ని రోజులు ఎంటర్‌టైన్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా తన తీరు సాగింది. మొదటి రెండు వారాలు బాగానే గేమ్ ఆడిన విష్ణుప్రియ తర్వాత పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్‌కు తెరదింపింది. తన లవ్‌లోని డెప్త్‌ను విష్ణుప్రియ చాలా ఓపెన్‌గా, ఎలాంటి సంకోచం లేకుండా, ధైర్యంగా బయటపెట్టినప్పటికీ పృథ్వీ మాత్రం కేవలం ఫ్రెండ్షిప్ అంటూ పక్కన పెట్టాడు. అలా కేవలం ఒక్క పృథ్వీపైనే ఫోకస్ పెట్టిన విష్ణుప్రియ తన బిగ్ బాస్ గేమ్‌ను తానే చేతులారా నాశనం చేసుకుంది. టైటిల్ కొడుతుందని ఆశించిన తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. డిసెంబర్ 8 ఎపిసోడ్‌లో నబీల్, విష్ణుప్రియ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. వారిలో నబీల్ సేవ్ అవ్వగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ తెలుగు 8లోకి 12వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ హౌజ్‌లో 3 నెలలకు పైగా (99 రోజులు/14 వారాలు) ఉంది. 14 వారాలకు విష్ణుప్రియ సుమారుగా రూ. 56 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, 99 రోజుల లెక్కన చూస్తే 56, 57,058 రూపాయలు అవుతున్నాయి. అంటే, బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. విష్ణుప్రియ 3 నెలల సంపాదన బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విజేత కంటే ఎక్కువగా ఉందని తెలుసుకున్న ఫ్యాన్స్.. ఇది క‌దా మా విష్ణు ప్రియ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది