Bigg Boss 5 Telugu : పక్కన చచ్చిపోతున్నా కూడా వదలేదు.. కాజల్ మీద ఆనీ మాస్టర్ కౌంటర్లు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 22 November 2021, 1:20 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో కాజల్ చేస్తోన్న పనులకు బయట ఎంతటి నెగెటివిటీని సంపాదించుకుంటుందో అందరికీ తెలిసిందే. ఆమె నవ్వులు, ఆమె మాటలు అన్నీ కూడా కన్నింగ్‌గా, ఏదో ప్లాన్ వేసినట్టుగానే ఉంటుంటాయని ఇంటి సభ్యులు చెబుతుంటారు. అలానే జనాలు కూడా ఆమె గురించి అలాంటి మాటలే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే ఆమె తన అతితో చంపేసింది. ప్రతీ దానికి ఏడవడం, మా పాప చూస్తే ఏమవుతుందో అని సింపతీ కార్డ్ ప్లే చేయడం మొదలుపెట్టింది.

కానీ ఇప్పుడు ఏమైందో ఏమో గానీ తన పాప గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. కాజల్ ప్లాన్లు, ఆమె వ్యక్తిత్వం గురించి తాజాగా ఆనీ మాస్టర్ చెప్పింది. ఆదివారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన ఆనీ మాస్టర్ సంచలన కామెంట్స్ చేసింది. అసలే గత వారంలో ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం నడిచింది. చివరకు సిరి, ఆనీ మాస్టర్‌లకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కకుండా చేసింది కూడా కాజల్. ఈ కోపం కూడా ఆనీ మాస్టర్‌కు ఉంది

Anee Master Satires On RJ Kajal In Ariyana Bigg Boss 5 telugu

Anee Master Satires On RJ Kajal In Ariyana Bigg Boss 5 telugu

Bigg Boss 5 Telugu : కాజల్‌పై ఆనీ మాస్టర్ కామెంట్స్

అరియానా చేస్తోన్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తాజాగా ఆనీ సంచలన కామెంట్స్ చేసింది. పక్కన వాడు చచ్చిపోతోన్నా సరే స్ట్రాటజీ ఏంటి.. చెప్పు.. వాడినేం చేద్దాం.. వీడిని ఏం చేద్దాం.. చెప్పు.. ఆ తరువాత చచ్చిపో అనే టైపు అంటూ కాజల్ గురించి ఆనీ మాస్టర్ చెప్పింది. అంటే కాజల్‌కు తన బాధ తనదే కానీ.. వేరే వాళ్ల బాధను పట్టించుకోదని చెప్పేసింది. కాజల్ ఒక్కోసారి బాగానే ఆడుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇంకొన్ని సార్లు మాత్రం చిరాకు పుట్టిస్తుంటుంది

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp