Janaki Kalaganaledu 22 Nov Today Episode : జానకి నీకోడలుగా సెట్ కాదు.. అని జ్ఞానాంబకు చెప్పేసిన మైరావతి.. దీంతో జానకిని ఇంట్లో నుంచి జ్ఞానాంబ వెళ్లగొడుతుందా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Janaki Kalaganaledu 22 Nov Today Episode : జానకి నీకోడలుగా సెట్ కాదు.. అని జ్ఞానాంబకు చెప్పేసిన మైరావతి.. దీంతో జానకిని ఇంట్లో నుంచి జ్ఞానాంబ వెళ్లగొడుతుందా?

Janaki Kalaganaledu 22 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 నవంబర్ 2021, సోమవారం 176 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అత్తయ్య గారు.. అంటూ మైరావతిని పలకరించబోతుంది జ్ఞానాంబ. దీంతో వద్దు.. నువ్వు సంజాయిషీలు చెప్పడం అయిపోయింది. నువ్వు ఎన్నిసార్లు సంజాయిషీలు చెప్పినా నీ మీద ఉన్న కోపం పోదు. నిన్ను క్షమించను.. అంటుంది.. ఇంకా ఏదో మాట్లాడబోయేసరికి వద్దు అంటుంది. నామాట […]

 Authored By gatla | The Telugu News | Updated on :22 November 2021,12:43 pm

Janaki Kalaganaledu 22 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 నవంబర్ 2021, సోమవారం 176 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అత్తయ్య గారు.. అంటూ మైరావతిని పలకరించబోతుంది జ్ఞానాంబ. దీంతో వద్దు.. నువ్వు సంజాయిషీలు చెప్పడం అయిపోయింది. నువ్వు ఎన్నిసార్లు సంజాయిషీలు చెప్పినా నీ మీద ఉన్న కోపం పోదు. నిన్ను క్షమించను.. అంటుంది.. ఇంకా ఏదో మాట్లాడబోయేసరికి వద్దు అంటుంది. నామాట దాటి నన్ను బాధపెట్టావు. దాన్ని దాటి ఇంకా బాధపెట్టకు అంటూ కట్టెను విసిరేస్తుంది. దీంతో జ్ఞానాంబ ఏం మాట్లాడకుండానే వెనుదిరుగుతుంది.

janaki kalaganaledu 22 november 2021 full episode

janaki kalaganaledu 22 november 2021 full episode

ఇంతలో రామా అక్కడికి వస్తాడు. గోదావరి అక్కడ కూర్చుంటుంది. తనను అక్కడి నుంచి లేపి.. రామా కూర్చొని మామిడికాయలకు కారం పట్టిస్తాడు. నానమ్మను ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురుచూస్తూ ఉండిపోయాను. నానమ్మ కళ్లలో బోలెడంత సంతోషాన్ని చూడాలని అనుకున్నాను. కానీ.. క్షమించలేనంత కోపాన్ని చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటాడు రామా. వెళ్లేటప్పుడు బోలెడన్ని జ్ఞాపకాలు తీసుకెళ్దామనుకున్నా కానీ.. అవి చేదు జ్ఞాపకాలు అవుతాయని అనుకోలేదు అంటాడు రామా.

నేనూ అనుకోలేదు రామయ్య అంటుంది మైరావతి. ఈ ముసలి ప్రాణానికి చివరి రోజుల్లో చాలా చాలా అందమైన జ్ఞాపకాలను ఇచ్చి పోతారనుకున్నాను కానీ.. ఇట్లా బాధపెట్టే జ్ఞాపకాలను ఇస్తారనుకోలేదు అని బాధపడుతుంది మైరావతి. రెండు రోజుల క్రితం మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూశాను. కానీ.. ఇప్పుడు ఎందుకు వచ్చారా అని బాధపడుతున్నా అంటుంది మైరావతి.

నానమ్మ ప్రేమించే మనసుకు క్షమించడం కూడా తెలుసు. కారం ఎక్కువైన ఈ పచ్చడిలో నెయ్యి కలిపితే కారం తగ్గుతుంది. మా నానమ్మ మమ్మల్ని క్షమించాలంటే ఈ మనవడు ఏం చేయాలి? అని ప్రశ్నిస్తాడు రామా. ఏం చేస్తే మా నానమ్మ మనసులో ఉన్న బాధ పోతుంది చెప్పు.. ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతాడు రామా.

నువ్వు ఏం చేయమన్నా చేస్తా నానమ్మ అంటాడు రామా. ఏరా.. ఈ నానమ్మ ఏం చెప్పినా చేస్తావా అని అడుగుతుంది. మాట తప్పవు కదా అంటుంది. తప్పను నానమ్మా అంటాడు. అట్లనా అయితే.. పోయి నీ పెళ్లాన్ని ఈడికి తీసుకురా అంటుంది. ఏం రామయ్య.. తీసుకురా అంటుంది. దీంతో వెళ్లి జానకిని తీసుకొని వస్తాడు రామా.

Janaki Kalaganaledu 22 Nov Today Episode : జానకి చెంప పగులగొట్టు అని చెప్పిన మైరావతి

నానమ్మ తీసుకొచ్చాను అంటాడు. రామయ్య.. ఈ నానమ్మ ఏం చెప్పినా చేస్తానన్నావు కదా. అయితే.. నీ పెళ్లాన్ని కొట్టాల.. నీ పెళ్లాం చెంప పగులగొట్టరా అంటుంది మైరావతి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఈ పరిస్థితులు రావడానికి కారణం నీ పెళ్లాం. నేను బాధపడటానికి.. నువ్వు నాముందు పచ్చాతాపంతో నిలబడటానికి నీ పెళ్లాం.

నా కోడలు నా మాటను ఎదురించడానికి కారణం నీ పెళ్లాం. తప్పు చేసినోళ్లను ఊరికే క్షమించి వదిలేయకుండా శిక్ష ఎందుకు వేస్తారో తెలుసా? ఇంకోసారి తప్పు చేయాలనే ఆలోచన రాగానే ఆ శిక్ష గుర్తుకు వస్తుందని. అందరి ముందు నువ్వు నీ పెళ్లాన్ని కొట్టే చెంపదెబ్బతో నీ పెళ్లానికి బుద్ధి రావాలి.. అంటుంది మైరావతి.

చెంపపగులగొట్టు అని అంటుంది మైరావతి. కానీ.. రామాకు ఏం చేయాలో అర్థం కాదు. నన్ను కొడితేనే అమ్మమ్మ గారి కోపం చల్లారుతుందంటే నేను సంతోషంగా భరిస్తాను.. కొట్టండి అంటుంది జానకి. దీంతో రామా షాక్ అవుతాడు. తన చేతులు కారంగా ఉంటాయి. అయినా కూడా రామా.. ఆ చేతులతోనే కొట్టాలా అని ఆలోచిస్తుంటాడు రామా.

ఈ నానమ్మ ఏం చెప్పినా చేస్తా అన్నావు కదా. మరి.. నీ పెళ్లాన్ని కొట్టమంటే ఎందుకు ఆలోచిస్తున్నావురా అంటుంది మైరావతి. నీకు కూడా ఈ నానమ్మ కంటే నీ పెళ్లామే ఎక్కువైపోయింది.. అనగానే రామా ఏమాత్రం ఆలోచించకుండా.. జానకిని కొట్టబోతాడు. ఇంతలో గోవిందరాజు వచ్చి అడ్డుకుంటాడు.

అమ్మ.. నీ మాటకు ఎదురు చెబుతున్నందుకు నన్ను క్షమించు. తప్పు చేసిన వాళ్లను శిక్షించడంలో అర్థం ఉంది. కానీ.. ఏ తప్పు చేయని వాళ్లను శిక్షించడం హింసించడం అవుతుంది అంటాడు గోవిందరాజు. జానకి ఎలాంటి తప్పు చేయలేదు అంటాడు గోవిందరాజు. జానకి అంతసేపు గదిలో నుంచి బయటికి రాకపోవడానికి కారణం ఏంటో.. ఇందాక జానకి.. వాళ్ల అత్తయ్య గారికి చెప్పింది.. అంటాడు.

అసలు విషయం ఏంటో చెబుతాడు గోవిందరాజులు. అయినప్పటికీ.. మైరావతి ఏమాత్రం సంతృప్తి చెందదు. నొప్పిని భరిస్తు కూడా పూజ దగ్గరికి వచ్చింది అమ్మ. తన బాధను అర్థం చేసుకొని ఓదార్చాలి కానీ.. ఇలా శిక్షించడం ఏంటమ్మా అంటాడు. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది మైరావతి.

కట్ చేస్తే జానకి విషయంలో మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని మైరావతిని అడుగుతుంది జ్ఞానాంబ. అందరి ముందే చెప్తాను అంటుంది మైరావతి. ఇసుర్రాయిలో గింజలు వేసి వాటిని విసరు అని జ్ఞానాంబకు చెబుతుంది. వేగంగా విసరు అంటుంది కానీ.. దాని పిడికిరి ఎగిరిపోతుంది.

కొత్త పిడికిలి ఎగిరిపోయినట్టే.. నీ కోడలు కూడా ఉండదు. చదువుకున్నానన్న తలపొగరు దానికి చాలా ఉంది. తను నీ మాట వినదు. వదిలేయ్. కాదు వదిలించుకో అని చెబుతుంది మైరావతి. దీంతో జానకి.. జ్ఞానాంబను వెళ్లగొడుతుందా అనేది తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది