Chiranjeevi : కాజల్ విషయంలో చేసిన తప్పుకు చిరంజీవికి కోట్లలో నష్టం..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రం డిజాస్టర్ కావటమే. ఎన్నడు లేని విధంగా చిరంజీవి సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టాలను చవి చూసింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద గొడవే చేశారు. దాంతో మెగా హీరోలు, డైరెక్టర్ కొరటాల శివ సమస్యను ఎలాగో సెటిల్ చేసుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ తలా కొంత వేసుకొని ఇష్యూని సాల్వ్ చేశారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఆచార్య సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ టీవీ ఛానెల్ ఇప్పుడు డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు హల్ చేస్తున్నాయి.
ముందు కాజల్ పాత్రను సినిమాలో షూట్ చేశారు. అయితే తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఆమె పాత్రను తొలగించేశారు. దీంతో నాన్ థియేటర్ హక్కుల్లో రెండున్నర కోట్లు కోత పడిందని… అలాగే సినిమా డిజాస్టర్ కావడంతో అదర్ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ రూపంలో రావాల్సిన అయిదు కోట్లు రాలేదని అంటున్నారు. ఈ సినిమాని జెమినీ వారు 15 కోట్లు పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు సినిమా డిజాస్టర్ అయ్యాక…తమను రేటు అయినా తగ్గించి, రీఎగ్రిమెంట్ చేయటమో లేక అఢ్వాన్స్ తిరిగి ఇచ్చి ఎగ్రిమెంట్ కాన్సిల్ చేయటమో చేయమని అడుగుతున్నారట.
Chiranjeevi : ఆచార్య కష్టాలు..
కాజల్ వంక చూపిస్తూ 15 కోట్లలో సగం రేటు ఇస్తామని జెమినీ వారు చెప్తున్నారు. దానికే ఓకే చెప్పాల్సిన సిట్యువేషన్. ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో చిరంజీవి, కొరటాల ఇరుక్కుపోయారంటున్నారు. ఏదేమైన ఆచార్య మిగిల్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా అందరికి మంచి గుణపాఠంగా మారిందని చెబుతున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్‌లో చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ చిత్రంలో ముందు కాజల్ అగర్వాల్‌ను చిరంజీవికి జోడీ అనుకున్నారు. పూజా హెగ్డేను రామ్ చరణ్‌కు జోడి అనుకున్నారు. కానీ తీరా కాజల్ పాత్రను లేకుండానే మూవీ రిలీజ్‌కి వచ్చింది.