Rajashekar : సుమ అడ్డాలో యాంగ్రీమెన్.. రాజశేఖర్ ఫ్యామిలీతో ఆట ఆడనున్న యాంకర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rajashekar : సుమ అడ్డాలో యాంగ్రీమెన్.. రాజశేఖర్ ఫ్యామిలీతో ఆట ఆడనున్న యాంకర్

Rajashekar : బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ విజయ పథంలో దూసుకు పోతున్న కార్యక్రమాలలో క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమం ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు హాజరయ్యే ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతారు. ఇకపోతే సంక్రాంతి పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యాంగ్రీ మెన్ హీరో రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ క్రమంలోనే […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :6 January 2022,2:40 pm

Rajashekar : బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ విజయ పథంలో దూసుకు పోతున్న కార్యక్రమాలలో క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమం ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు హాజరయ్యే ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతారు. ఇకపోతే సంక్రాంతి పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యాంగ్రీ మెన్ హీరో రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి హీరో రాజశేఖర్ ను గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఆహ్వానించారు. ఇలాసంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా సుమ అడ్డాలో రాజశేఖర్ జీవిత కుటుంబ సభ్యులతో సుమా క్యాష్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

Angry man rajashekar family in cash program on special

Angry man rajashekar family in cash program on special

Rajashekar : క్యాష్ ప్రోగ్రాం ఎలాగుంది రాజశేఖర్ గారు….

సుమ రాజశేఖర్ కుటుంబ సభ్యులను సాదరంగా వేదికపైకి ఆహ్వానించగా అనంతరం రాజశేఖర్ గారితో మాట్లాడుతూ క్యాష్ ప్రోగ్రాం ఎలాగ ఉంది సర్ అని అడిగగా సూపర్ అంటూ సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవిత వారి కూతుళ్లు ఇద్దరు శివాని, శివాత్మిక హాజరయ్యారు. ఇక రాజశేఖర్ జీవిత కూతుర్లు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఎప్పుడు ఇలా కుటుంబం మొత్తం ఏ కార్యక్రమానికి హాజరు కాని రాజశేఖర్ కుటుంబం క్యాష్ కార్యక్రమానికి హాజరు కావడంతో ఈ కార్యక్రమం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది