Anil Ravipudi – Taraka Ratna : ఆ సినిమాలో తారకరత్నకి మంచి రోల్ ఇద్దామనుకున్నా.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: February 22, 2023, 11:11 pm

Anil Ravipudi – Taraka Ratna : నందమూరి తారకరత్న ఈ లోకం వదిలి వెళ్లిపోయి అప్పుడే ఐదు రోజులు అవుతోంది. తారకరత్న మృతిని ఇప్పటికీ నందమూరి అభిమానులు, నందమూరి కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. తారకరత్నను చివరి సారి చూడటానికి సినీ, రాజకీయ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి తారకరత్నకు నివాళులు అర్పించారు. సినీ ప్రముఖులు అయితే తారకరత్నతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

anil ravipudi emotional words about Taraka Ratna

anil ravipudi emotional words about Taraka Ratna

ఇక.. జూనియర్ ఎన్టీఆర్ అయితే తారకరత్నను చూసి బావురుమన్నారు. తారకరత్న లేరన్న విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తారకరత్నను కడసారి చూడటానికి వచ్చిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తారకరత్న గురించి చాలా గొప్పగా మాట్లాడారు. రెండు మూడు సార్లు ఆయన్ను కలిశానని చెప్పారు. తన పార్థీవదేహానికి నివాళులు అర్పించిన అనంతరం అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు.

 

Anil Ravipudi – Taraka Ratna : కంటతడి పెట్టిన అనిల్ రావిపూడి

మోస్ట్ షాకింగ్ అని చెప్పాలి. 25 రోజుల నుంచి ఆయన మన మధ్యకు రావాలని ప్రార్థించాను కానీ.. ఆయన మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. నందమూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. బాలయ్య బాబు గారు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. తారకరత్న గారికి ఈ సినిమాలో మంచి వేషం ఇవ్వాలి అని అన్నారు. నేను కూడా ఆయన కోసం మంచి క్యారెక్టర్ చేద్దామని అనుకునే లోపే ఇలా జరిగింది. తారకరత్న గారు మిస్ యూ ఎలాట్ సార్.. అంటూ అనిల్ రావిపూడి భావోద్వేగానికి గురయ్యారు.

https://youtube.com/watch?v=i0IL3MOC13E&si=EnSIkaIECMiOmarE

Breaking News 2

No bio available for this author.

  1. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  2. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  3. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  4. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  5. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  6. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  7. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp