Taraka Ratna : తారకరత్న సీక్రెట్ లాకర్ లో అలేఖ్య రెడ్డికి తెలియని సీక్రెట్స్ ..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Taraka Ratna : తారకరత్న సీక్రెట్ లాకర్ లో అలేఖ్య రెడ్డికి తెలియని సీక్రెట్స్ ..!!

Taraka Ratna : నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే తారకరత్నను కోల్పోవడం అందరికీ బాధాకరం. ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న నెంబర్ వన్ కుర్రోడు సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే ఆయన పలు సినిమాలలో కీలక పాత్ర చేసేందుకు సైన్ చేశారు. ఇంతలోనే దేవుడు ఆయనను పైకి తీసుకెళ్లాడు. దీంతో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 March 2023,9:20 pm

Taraka Ratna : నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే తారకరత్నను కోల్పోవడం అందరికీ బాధాకరం. ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న నెంబర్ వన్ కుర్రోడు సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే ఆయన పలు సినిమాలలో కీలక పాత్ర చేసేందుకు సైన్ చేశారు. ఇంతలోనే దేవుడు ఆయనను పైకి తీసుకెళ్లాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ , కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Taraka Ratna secret locker Alekhya Reddy

Taraka Ratna secret locker Alekhya Reddy

ఇక మనకు తెలిసిందే తారకరత్న ఇంట్లో వాళ్ళని ఎదిరించి అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో నందమూరి ఫ్యామిలీ తారకరత్నను చాలా ఏళ్లు దూరం పెట్టింది. తర్వాత కుమార్తె నిష్కా జన్మించాక తారక రత్నను తమ కుటుంబంలో కలుపుకున్నారు. తారకరత్నకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు, ఒక అబ్బాయి ఉన్నారు. ఇంత చిన్న వయసులో తండ్రిని కోల్పోవడం పిల్లలు దురదృష్టం. ఇక భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే సోషల్ మీడియాలో తన భర్త తారకరత్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఓ ఫోటోను షేర్ చేశారు.

Love against all odds: Tarak, Alekya's marriage nothing less than filmy  drama

రీసెంట్గా తారకరత్న గదిలో సీక్రెట్ లాకర్ బయటపడింది. అలేఖ్య రెడ్డి సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువులు చూసి షాకయ్యారు. ఎవరైనా సరే బంగారం దాచిపెడతారు. అయితే తారక రత్న తన కూతురుకు సంబంధించిన ఫస్ట్ బొమ్మ, ఫస్ట్ ఫొటోస్, ఉగ్గు గిన్నె చాలా జాగ్రత్తగా లాకర్లో దాచిపెట్టారు. దీన్ని చూసిన ఆయన భార్య అలేఖ్య కూతురు నిష్క చాలా ఎమోషనల్ అయ్యారు. తారకరత్న లేని లోటును ఆ కుటుంబానికి ఎవరు తీర్చలేరు. దేవుడు జాలి లేకుండా తారకరత్న తీసుకెళ్లాడు అని అభిమానులు బాధతో కామెంట్లు చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది