Taraka Ratna : తారకరత్నతో చివరిగా దిగిన ఫోటోను షేర్ చేసిన అలేఖ్య రెడ్డి .. చూస్తే కన్నీళ్లు ఆగవు ..!!
Taraka Ratna ; నందమూరి తారకరత్న మరణం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన తారకరత్న పిల్లలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇక భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో తారకరత్నతో దిగిన చివరి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోను చూస్తే కన్నీళ్లు ఆగవు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అలేఖ్య రెడ్డి తాజాగా తారకరత్నతో దిగిన చివరి ఫోటోను అభిమానులతో షేర్ చేసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.
మనకు తెలిసిందే రీసెంట్ గా నందమూరి తారకరత్న తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ టైంలోనే తన పిల్లల్ని, భార్యని మీడియాకు పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే తారకరత్న తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఫోటోను దిగారు. ఈ ఫోటోనే అలేఖ్య రెడ్డి తన భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటుంటే హృదయం ముక్కలైపోతుంది. ఇది కల అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది, నీ వాయిస్ తో అమ్మ బంగారు అంటూ లేపవా అంటూ ఎంతో బాధగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
దీంతో ఈ పోస్ట్ చూసిన అభిమానులు బాగా ఫీలవుతున్నారు. ఇంత చిన్న వయసులో భర్తను కోల్పోయిన అలేఖ్య రెడ్డిని చూసి అందరూ బాధపడిపోతున్నారు. దేవుడికి మనసు ఉండదు ఇంత చిన్న వయసులోనే ఆ పిల్లలకు తండ్రి దూరమయ్యేలా చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మనకు తెలిసిందే తారకరత్న కుటుంబ అంగీకారం లేకుండా అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో నందమూరి ఫ్యామిలీ తారకరత్నను చాలా ఏళ్లు దూరం ఉంచింది. తర్వాత ఈ దంపతులకు కుమార్తె పుట్టాక అందరూ ఒక్కటయ్యారు.