Anil Ravipudi – Taraka Ratna : నందమూరి తారకరత్న ఈ లోకం వదిలి వెళ్లిపోయి అప్పుడే ఐదు రోజులు అవుతోంది. తారకరత్న మృతిని ఇప్పటికీ నందమూరి అభిమానులు, నందమూరి కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. తారకరత్నను చివరి సారి చూడటానికి సినీ, రాజకీయ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి తారకరత్నకు నివాళులు అర్పించారు. సినీ ప్రముఖులు అయితే తారకరత్నతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
anil ravipudi emotional words about Taraka Ratna
ఇక.. జూనియర్ ఎన్టీఆర్ అయితే తారకరత్నను చూసి బావురుమన్నారు. తారకరత్న లేరన్న విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తారకరత్నను కడసారి చూడటానికి వచ్చిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తారకరత్న గురించి చాలా గొప్పగా మాట్లాడారు. రెండు మూడు సార్లు ఆయన్ను కలిశానని చెప్పారు. తన పార్థీవదేహానికి నివాళులు అర్పించిన అనంతరం అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు.
మోస్ట్ షాకింగ్ అని చెప్పాలి. 25 రోజుల నుంచి ఆయన మన మధ్యకు రావాలని ప్రార్థించాను కానీ.. ఆయన మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. నందమూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. బాలయ్య బాబు గారు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. తారకరత్న గారికి ఈ సినిమాలో మంచి వేషం ఇవ్వాలి అని అన్నారు. నేను కూడా ఆయన కోసం మంచి క్యారెక్టర్ చేద్దామని అనుకునే లోపే ఇలా జరిగింది. తారకరత్న గారు మిస్ యూ ఎలాట్ సార్.. అంటూ అనిల్ రావిపూడి భావోద్వేగానికి గురయ్యారు.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.