Anil Ravipudi : ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్న అనీల్ రావిపూడి..నెక్ట్స్ ప్రాజెక్ట్ చిరంజీవితో..!
ప్రధానాంశాలు:
Anil Ravipudi : ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్న అనీల్ రావిపూడి..నెక్ట్స్ ప్రాజెక్ట్ చిరంజీవితో..!
Anil Ravipudi : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టపడిన కూడా కొందరికి సక్సెస్ అంత ఈజీగా రాదు. అయితే టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు అనీల్ రావిపూడి. ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీ లోకి అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా నేటికీ పదేళ్లు పూర్తయింది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవవ్వరూ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి వెంకీ మామతో వరుసగా మూడు సినిమాలను చేశాడు. ఎఫ్ 2, ఎఫ్ 3 అలాగే రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో అలరించాడు.

Anil Ravipudi : ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్న అనీల్ రావిపూడి..నెక్ట్స్ ప్రాజెక్ట్ చిరంజీవితో..!
Anil Ravipudi సక్సెస్ ఫుల్ డైరెక్టర్..
ప్రేక్షకులు తన సినిమాలను ఆదరిస్తున్నంతవరకు దర్శకుడిగా మరిన్ని చిత్రాలను తెరకెక్కిస్తానన్నాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. పదేళ్లలో వరుస హిట్ సినిమాలను తెరకేక్కించడం ఆయన మాత్రమే దక్కిన రికార్డు అని తెలుగు సినీ అభిమానులు అంటున్నారు.. రీసెంట్ గా వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ తో మరో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం” రికార్డులు తిరగరాస్తుండగా టీం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా లాక్ అయ్యిన సంగతి తెలిసిందే.
మరి ఈ ప్రాజెక్ట్ పై తన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. రెండు ఫింగర్స్ క్రాస్ చేస్తూ వెంకటేష్ గారి సినిమాలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉందో అలాంటిది చిరంజీవి గారికి ఈ తరహా మంచి మెలోడీ సాంగ్స్ పడితే ఎలా ఉంటుంది? ఇలాంటి మెలోడియస్ సాంగ్స్ కి ఆయన గ్రేస్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి డెఫినెట్ గా ఇంతే హార్డ్ వర్క్ అక్కడ కూడా పెడతా ప్రామిస్ అంటూ కామెంట్స్ చేశారు. దీనితో మెగా ఫాన్స్ లో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక ఇదిలా ఉంటే అనీల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూలు చేయడం మామూలు విషయం కాదు. మూవీకి టోటల్ బడ్జెట్ గా 80 కోట్లను నిర్మాతలు పెట్టారు. పెట్టిన దానికంటే త్రిపుల్ కలెక్షన్స్ వచ్చాయి.. అయితే డైరెక్టర్ కు 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారు. హీరో, ప్రొడ్యూసర్ కంటే ఎక్కువే.. అలాగే మూవీ లాభాల్లో కొంత షేర్ కూడా తీసుకున్నారని టాక్.