Chiranjeevi : స్టార్ హీరోలతో సినిమా అంటేనే కత్తి మీద సాము వంటిది. వారి రెమ్యూనరేషన్లే తడిసి మోపెడు అవుతుంటాయి. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా తట్టాబుట్టా సర్దుకోవడమే. అందుకే స్టార్ హీరోలతో పెద్ద నిర్మాతలే సాహసం చేస్తారు. చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలు కూడా స్టార్ల జోలికి వెళ్లరు. ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో అనిల్ సుంకర మీద పిడుగు పడింది. సామజవరగమన, హిడింబ సినిమాలతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతలోపే భోళా శంకర్ అంటూ మరో పిడుగు పడింది. ఈ సారి ఏకంగా పాతాళంలోకి వెళ్లినట్టు అయింది.
భోళా శంకర్ సినిమా సొంతంగా రిలీజ్ చేసుకున్నాడట అనిల్ సుంకర. బిజినెస్ ఓ మోస్తరుగా జరుగుతుంటే.. చిరంజీవి హర్ట్ అయ్యాడట. నా స్థాయిని తగ్గించి, తక్కువ రేటుకు అమ్ముతున్నావా? అని అనిల్ సుంకర మీద ఫైర్ అయ్యాడట. దీంతో అనిల్ సుంకర సొంతంగా రిలీజ్ చేశాడట. దీంతో అనిల్ సుంకర దాదాపు అరవై కోట్ల వరకు లాస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్ ఈవెన్ అవ్వదని ట్రేడ్ లెక్కలు చూస్తే అర్థం అవుతోంది. సినిమా డిజాస్టర్‌గా నిలవనుంది.
అయితే ఈ టైంలో చిరంజీవి తన రెమ్యూనరేషన్ కోసం పట్టుబట్టాడట. నిర్మాతను పీడిస్తున్నాడట. ఈ మేరకు నెట్టింట్లో రూమర్లు చక్కర్లు కొడుతన్నాయి. ఈ సినిమా 65 కోట్ల రెమ్యూనరేషన్ చిరు తీసుకుంటున్నాడట. అందులో 50 కోట్ల వరకు ఆల్రెడీ అనిల్ సుంకర ఇచ్చేశాడట. కానీ మిగిలిన డబ్బు కోసం ఇప్పుడు చిరు పట్టుబట్టుకుని కూర్చున్నాడట. ఈ మేరకు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. చిరుకి ఇవ్వాల్సిన డబ్బు కోసం అనిల్ సుంకర తన ప్రాపర్టీలను తాకట్టు పెట్టడం, అమ్మడం వంటివి చేస్తున్నాడట. మొత్తానికి చిరుతో పెట్టుకున్న అనిల్ సుంకరకు సున్నం కూడా మిగిలేట్టు లేదని సెటైర్లు పడుతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.