Annapurnamma : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని వందల పాత్రలు చేసిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మగారు. మదర్ రోల్స్ ఎక్కువగా చేసిన ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. పాత్ర ఎలాంటిదైనా అందులో ఆమె ప్రత్యేకతను చాటాల్సిందే. కామెడీ రోల్ చేసినా, సీరియస్ రోల్ చేసిన, సెంటిమెంట్ రోల్ చేసినా అన్నపూర్ణమ్మ పాత్ర మాత్రమే కనిపిస్తుంది.సీనియారిటీ రావడంతో గత కొంతకాలంగా వరుసగా సినిమాలు చేసే అవకాశాలు దక్కడం లేదు.

ఆ మధ్య విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నటించిన గీత గోవిందం సినిమాలో కీలక పాత్ర పోషించి మరోసారి తన మార్క్ చూపించారు. కాగా ఇటీవల అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన కూతురి మృతిపై ఎవరు ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా బాగావుందనుకున్న సమయంలో ఓ రోజు ఉదయాన్నే ఫ్యాన్ కు ఉరి వేసుకొని వ్రేలాడుతూ కనిపించడం షాక్ కు గురి చేసిందని చెప్పారు.
Annapurnamma : కట్న కానుకలు, ఫ్లాట్, డబ్బు, నగలు వంటి అన్నీ లాంఛనాలు ఇచ్చారు.

ఇదే సమయంలో తన కూతురు మరణానికి గల కారణంపై కూడా ఆమె ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అన్నపూర్ణమ్మ వ్యక్తిగత జీవితంలో ఒక విషాదాన్ని అనుభవించారు. ఆమె దత్త పుత్రికను ఎంతో ఆప్యాయంగా పెంచుకొని ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. ఇవ్వాల్సిన కట్న కానుకలు, ఫ్లాట్, డబ్బు, నగలు వంటి అన్నీ లాంఛనాలు ఇచ్చారు. కానీ పెళ్ళైన కొనాళ్ళకే అనంతలోకాలకి వెళ్ళిపోయారు. మనవరాలు పుట్టిన కొన్నాళ్లకు కూతురు ప్రాణాలు కోల్పోయింది. బెడ్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్న వార్త అప్పట్లో అన్నీ మీడియాలలో వైరల్ అయ్యింది. అయితే అసలు కారణం ఏమిటనేది ఎవరు వెల్లడించలేకపోయారు. ఇటీవల ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ బయటపెట్టారు.
Annapurnamma : తను చెప్పిన కొన్ని విషయాలు నేను పెద్దగా పట్టించుకోలేదు.

చిన్నప్పటి నుంచి తను చెప్పిన కొన్ని విషయాలు నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే అత్తింటి వాళ్ళ మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఇచ్చింది లేదు. ఏదైనా సమస్య ఉన్నా నాకు చెబితే మాట్లాడి ఉండేదాన్నేమో. కానీ ఎప్పుడు ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చింది. అంతా హ్యాపిగా ఉందనుకున్నాను. నా దగ్గర్నుంచి సంతోషంగా వెళ్ళింది. మరునాడు వాళ్ళ బెడ్‌రూంలో సీలింగ్ ఫ్యాన్‌కి వేళాడుతూ కనిపించింది. బహుషా తను లోలోపల బాధపడి ఉండోచ్చు. తనకి కోపం కాస్త ఎక్కువే. ఆ కారణంగానే తొందరపడి ఇలా చేసి ఉండోచ్చునని తెలిపారు అన్నపూర్ణమ్మ.
ఇది కూడా చదవండి ==> బిగ్ బాస్ షోలో గొడవలు.. అరియానాపై లాస్య కామెంట్స్..!
ఇది కూడా చదవండి ==> Varsha హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో !
ఇది కూడా చదవండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వచ్చా వర్షిణి.. వైరల్ వీడియో
ఇది కూడా చదవండి ==> కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోలు నిజంగా అలాంటివారా..!