Ariyana : బిగ్ బాస్ షోలో గొడవలు.. అరియానాపై లాస్య కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ariyana : బిగ్ బాస్ షోలో గొడవలు.. అరియానాపై లాస్య కామెంట్స్..!

Ariyana బిగ్ బాస్ ఇంట్లో ఉండే పరిస్థితులు వేరు.. బయటకు వచ్చాక ఉండే పరిస్థితులు వేరు. అక్కడ శత్రువులుగా ఉన్న   వారు బయటకు వచ్చాక మిత్రుల్లా మారిపోవచ్చు. లేదా షోలో మిత్రుల్లా ఉన్న వారు బయటకు వచ్చాక దూరంగా ఉండొచ్చు. అలా తాజాగా నాల్గో   సీజన్ గొడవలు మళ్లీ ఓ సారి హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మేరకు లాస్య చేసిన   ఓ పోస్ట్ కారణం అవుతోంది. లాస్య,   అరియానాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :13 July 2021,4:30 pm

Ariyana బిగ్ బాస్ ఇంట్లో ఉండే పరిస్థితులు వేరు.. బయటకు వచ్చాక ఉండే పరిస్థితులు వేరు. అక్కడ శత్రువులుగా ఉన్న   వారు బయటకు వచ్చాక మిత్రుల్లా మారిపోవచ్చు. లేదా షోలో మిత్రుల్లా ఉన్న వారు బయటకు వచ్చాక దూరంగా ఉండొచ్చు. అలా తాజాగా నాల్గో   సీజన్ గొడవలు మళ్లీ ఓ సారి హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మేరకు లాస్య చేసిన   ఓ పోస్ట్ కారణం అవుతోంది. లాస్య,   అరియానాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా వ్యవహారం నడిచేది. ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఈ ఇద్దరి మధ్య జరుగుతూనే ఉండేది. నామినేషన్స్ వచ్చాయంటే చాలు ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరగాల్సిందే.

Lasya Manjunath About Ariyana Glory

Lasya Manjunath About Ariyana Glory

బిగ్ బాస్ షోలో గొడవలు Ariyana

నన్ను నామినేట్ చేయాలంటే అంత పరిగెత్తి దెబ్బలు తగిలించుకోవాలా? అంటూ అరియానా మీద లాస్య సెటైర్లు కూడా వేసేసింది. అలా లాస్య, అరియానాల మధ్య వైరం కొనసాగుతూనే వచ్చింది. లాస్య Lasya , హారిక, అభిజిత్, నోయల్ ఒక వైపు. అవినాష్, అరియానా Ariyana , అమ్మ రాజశేఖర్ ఇలా అందరూ మరో వైపు. గ్రూపులు కట్టి మరీ ఒకరి  మీద ఒకరు ఆరోపణలు చేసుకునేవారు.అయితే మనుషులు తగ్గుతున్న కొద్దీ, బిగ్ బాస్ షో Bigg boss show  ముగుస్తున్నా   కొద్దీ అందరూ స్నేహితుల్లానే మారిపోయారు. కానీ లాస్య, అరియానా మధ్య చివరి వరకు అలానే దూరం కొనసాగుతూ వచ్చింది.

Lasya Manjunath About Ariyana Glory

Lasya Manjunath About Ariyana Glory

అరియానాపై లాస్య కామెంట్స్ Ariyana

కానీ షో ముగిసిన తరువాత అందరూ బయటకు వచ్చాక.. సమీకరణాలు మారిపోయాయి. లాస్య, అరియానా చాలా  క్లోజ్ అయ్యారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా కలిసిపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఏదో ఒక ఈవెంట్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.  ఈ ఈవెంట్‌లో లాస్య Lasya , అరియానా Ariyana రచ్చ చేస్తున్నారు. అంతే కాకుండా   లాస్య, అరియానాలు బయట పార్టీలు కూడా చేసుకుంటున్నారు. ఈ మేరకు లాస్య ఓ పోస్ట్ చేసింది. బిగ్ బాస్ ఇంట్లో మనం ఫ్రెండ్స్ కాలేకపోయినా కూడా బయట మంచి ఫ్రెండ్స్ అయ్యాం డార్లింగ్ అని అరియానాపై కామెంట్ చేసింది. లవ్యూ అక్కా అని లాస్యపై అరియానా ప్రేమను కురిపించింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో !

ఇది కూడా చ‌ద‌వండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వ‌చ్చా వర్షిణి.. వైర‌ల్ వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> కోట శ్రీనివాస రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. టాలీవుడ్ హీరోలు నిజంగా అలాంటివారా..!

ఇది కూడా చ‌ద‌వండి ==> కార్తీకదీపంలో డాక్టర్ బాబుకు అలా చాన్స్ వచ్చిందా?.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన డైరెక్టర్..!

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది