
ANR so angry with NTR who has seen the Chief Minister as well
ANR : పౌరాణిక సినిమాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. రాముడైనా, రావణుడైన నటించి మెప్పించగల సత్తా ఆయనకే ఉంది. ఒకపక్క కమర్షియల్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క పౌరాణిక సినిమాలను చేస్తుండేవారు. అందులో భాగంగా వచ్చిన సినిమా దానవీరశూరకర్ణ. ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూడవచ్చు. ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ శ్రమ వల్లనే విజయం అయిందని చెప్పవచ్చు. అప్పటి సినీ రంగంలో తిరుగులేని హీరోగా ఎంతో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి
అంతేకాకుండా కర్ణుడిగా దుర్యోధనుడిగా కృష్ణుడు పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో ముందుగా కృష్ణుడి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావుని నటించమని ఎన్టీఆర్ అడిగారట. అయితే దానవీరశూరకర్ణ సినిమాలు నటించడానికి ఏఎన్ఆర్ సున్నితంగా తిరస్కరించారట. అందువల్ల అన్నగారే ఈ సినిమాలో కూడా కృష్ణుడి వేషం వేశారు. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూసిన కళ్ళతో తనను జనం చూడలేరని అలాగే తాను కర్ణుడిగా నటిస్తే పాండవులు మరుగుజ్జులుగా కనిపిస్తారని అక్కినేని నాగేశ్వరావు సున్నితంగా చేయను అని చెప్పారట. దీంతో ఎన్టీఆర్ ఊరుకోలేదు.
ANR so angry with NTR who has seen the Chief Minister as well
మర్నాడు అక్కినేనిని అప్పటి ఏపీ సీఎం జలగం వెంగళరావు నుంచి పిలుపు వచ్చింది. మీరిద్దరూ కలిసి నటిస్తే జనం తప్పకుండా ఆదరిస్తారు ఒప్పుకోండి అన్నారట జలగం. దీంతో నాగేశ్వరరావు ఎన్టీఆర్కు చెప్పిన సమాధానమే జలగం వెంగళరావు కు చెప్పి అతి కష్టం మీద ఆ సినిమా నుంచి తప్పించుకున్నారట. ఆ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ పట్టు విడవలేదు. తన తర్వాతి సినిమాలో ఏఎన్ఆర్ ను చాణక్యుడి పాత్రలో చూపించి తన మాట నెగ్గించుకున్నాడు. ఆ సినిమా పేరే చాణక్యచంద్రగుప్త. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చూసిన ప్రేక్షకులు ఎంతో సంతోషించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.